AP Elections 2024: గత ఎన్నికల సమయంలో ‘డేటా చోరీ’ అంటూ నానా బీభత్సం సృష్టించిన జగన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటాను గుప్పిట పట్టేశారు అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజల వ్యక్తిగత డేటా చోరీకి గురవుతుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజల వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్తోందని ఆరోపిస్తున్నారు.
పెళ్లి ఫొటోల నుంచి పాస్‌పోర్టు, పాన్ వరకు, ఆధార్, రేషన్ కార్డులు, ఫోన్ నెంబర్లు అన్నీ ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకునేలా వెబ్‌సైట్లలో అందుబాటులోకి పెట్టడం పెద్ద ప్రమాదకరం అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీకి గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. గతంలో జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డేటా చోరీ గురించి ఆరోపణలు చేసి.. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ దానిగురించి పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు.
ఏపీలో డేటా చౌర్యం యథేచ్చగా జరుగుతోంది. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ బహిరంగ సభల్లో చాలాసార్లు ప్రస్తావించారు. వాలంటీర్ల ద్వారా ప్రజల వ్యక్తిగత సమాచారం పూర్తిగా ప్రభుత్వం సేకరిస్తుందని పవన్ కల్యాణ్ పదే పదే చెప్పారు. గత ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వం ఈ అంశంపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మున్సిపల్ శాఖలోని సీడీఎం అనే వెబ్‌సైట్ ద్వారా డేటా చౌర్యం జరిగేందుకు చాలా అవకాశాలున్నాయని ఆరోపిస్తున్నారు.
క్రిటికల్ రివర్ కంపెనీకి రిజిస్ట్రేషన్ వివరాలు, వేలిముద్రలు, ఇతర సమాచారమూ ఆ సంస్థకే వెళ్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఇంటి అడ్రస్ నుంచి బ్యాంక్ ఖాతా వరకు అన్ని వివరాలు ప్రభుత్వం ప్రజల నుంచి సేకరిస్తోందని, అవసరం లేకున్నా వ్యక్తిగత సమాచారాన్ని అంతటినీ తీసుకోవడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రజల వ్యక్తిగత సమాచారాన్నంతా వెబ్‌సైట్‌లలోపెట్టడం వల్ల ప్రజల గోప్యతకు భంగం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేవలం చూడటమే కాకుండా వాటిని డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించడం వల్ల ఇది చాలా ప్రమాదకరం అని ఆరోపిస్తున్నారు. వెబ్‌సైట్ల నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడం వల్ల వాళ్లు సరిగా నిర్వహించక పోవడం వలన డేటా చౌర్యం జరుగుతందని తెలిసినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం దీనిపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని నిలదీస్తున్నారు. ఇలాంటి చర్యలు సైబర్ నేరగాళ్లకు మంచి అవకాశం ఇచ్చినట్లు ఆరోపిస్తున్నారు.
జగన్ అధికారంలోకి రాగానే వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటిలోని వ్యక్తుల సమాచారం సేకరించారని వాటినిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ప్రజలకు సంబంధించి అవసరం ఉన్నా, లేకున్నా కీలక సమాచారాన్ని ప్రభుత్వ వెబ్‌సైట్లలో పెడుతున్నారని మండిపడుతున్నారు.
కుటుంబ సభ్యులకు, బంధువులకు, చివరకు భార్యకు కూడా తెలియని వివరాలు జగన్ గుప్పిట్లోకి వెళ్లాయని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం కోట్లు వెచ్చించి డెవలప్ చేయించిన వెబ్‌సైట్లలో ఈ సమాచారాన్నంతటినీ పెట్టారని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజల వ్యక్తిగత డేటా చోరీకి గురవుతుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజల వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్తోందని ఆరోపిస్తున్నారు. పెళ్లి ఫొటోల నుంచి పాస్‌పోర్టు, పాన్ వరకు, ఆధార్, రేషన్ కార్డులు, ఫోన్ నెంబర్లు అన్నీ ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకునేలా వెబ్‌సైట్లలో అందుబాటులోకి పెట్టడం పెద్ద ప్రమాదకరం అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీకి గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. గతంలో జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డేటా చోరీ గురించి ఆరోపణలు చేసి.. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ దానిగురించి పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ఏపీలో డేటా చౌర్యం యథేచ్చగా జరుగుతోంది. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ బహిరంగ సభల్లో చాలాసార్లు ప్రస్తావించారు.
వాలంటీర్ల ద్వారా ప్రజల వ్యక్తిగత సమాచారం పూర్తిగా ప్రభుత్వం సేకరిస్తుందని పవన్ కల్యాణ్ పదే పదే చెప్పారు. గత ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వం ఈ అంశంపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మున్సిపల్ శాఖలోని సీడీఎం అనే వెబ్‌సైట్ ద్వారా డేటా చౌర్యం జరిగేందుకు చాలా అవకాశాలున్నాయని ఆరోపిస్తున్నారు. క్రిటికల్ రివర్ కంపెనీకి రిజిస్ట్రేషన్ వివరాలు, వేలిముద్రలు, ఇతర సమాచారమూ ఆ సంస్థకే వెళ్తున్నాయని ఆరోపిస్తున్నారు.
ఇంటి అడ్రస్ నుంచి బ్యాంక్ ఖాతా వరకు అన్ని వివరాలు ప్రభుత్వం ప్రజల నుంచి సేకరిస్తోందని, అవసరం లేకున్నా వ్యక్తిగత సమాచారాన్ని అంతటినీ తీసుకోవడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రజల వ్యక్తిగత సమాచారాన్నంతా వెబ్‌సైట్‌లలో పెట్టడం వల్ల ప్రజల గోప్యతకు భంగం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం చూడటమే కాకుండా వాటిని డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించడం వల్ల ఇది చాలా ప్రమాదకరం అని ఆరోపిస్తున్నారు.
వెబ్‌సైట్ల నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడం వల్ల వాళ్లు సరిగా నిర్వహించక పోవడం వలన డేటా చౌర్యం జరుగుతందని తెలిసినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం దీనిపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని నిలదీస్తున్నారు. ఇలాంటి చర్యలు సైబర్ నేరగాళ్లకు మంచి అవకాశం ఇచ్చినట్లు ఆరోపిస్తున్నారు.
జగన్ అధికారంలోకి రాగానే వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటిలోని వ్యక్తుల సమాచారం సేకరించారని వాటినిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ప్రజలకు సంబంధించి అవసరం ఉన్నా, లేకున్నా కీలక సమాచారాన్ని ప్రభుత్వ వెబ్‌సైట్లలో పెడుతున్నారని మండిపడుతున్నారు. కుటుంబ సభ్యులకు, బంధువులకు, చివరకు భార్యకు కూడా తెలియని వివరాలు జగన్ గుప్పిట్లోకి వెళ్లాయని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం కోట్లు వెచ్చించి డెవలప్ చేయించిన వెబ్‌సైట్లలో ఈ సమాచారాన్నంతటినీ పెట్టారని అంటున్నారు.