Homeతెలుగు Newsతెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు..

తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు..

2భారతదేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో మూడో స్థానంలో ఉన్న తెలుగుకు స్టాట్యూట్‌ ఆఫ్‌ యూనిటీ వద్ద గుర్తింపు లభించకపోవడం తెలుగు బిడ్డగా తన మనసు క్షోభిస్తోందని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాల్లో కూడా తెలుగువారంటే కేంద్రానికి ఇంత వివక్షా? అని నిలదీశారు. ప్రతి ఒక్క తెలుగు వ్యక్తి తన ఆవేదనను వ్యక్తం చేయాల్సిన తరుణమిదని అన్నారు. ప్రపంచంలో అతి ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో నరేంద్ర మోడీ సఫలీకృతం అయ్యారు.. కానీ పటేల్‌ సమైక్య స్ఫూర్తిని కాపాడటంలో మాత్రం విఫలమయ్యారని విమర్శించారు. ఐక్యతా ప్రతిమ ఏర్పాటులో తెలుగుని విస్మరించడం ద్వారా బీజేపీ తెలుగువారి ఆత్మగౌరవాన్ని మరోసారి దెబ్బతీసిందని లోకేశ్‌ ఆక్షేపించారు.

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu