పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.. కొవ్వూరు టోల్ గేట్ దగ్గరకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు వలస కార్మికులు… అయితే, పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ, పోలీసులపైకి వలస కూలీలు రాళ్లు విసరడంతో.. లాఠీలకు పనిచెప్పారు పోలీసులు.. పోలీసుల లాఠీచార్జీలు కొందరు చెదిరిపోగా.. మరికొందరు కార్మికులను వారించి రోడ్లపై కూర్చోబెట్టి.. అధికారులతో మాట్లాడిస్తున్నారు పోలీసులు. లాక్‌డౌన్ కారణంగా ఎక్కడికక్కడ వలస కూలీలు చిక్కుకుపోయారు.. అయితే, సొంత ప్రాంతాలకు వెళ్లాలన్న ఆతృత వారిలో ఎక్కువగా కనిపిస్తోంది.. కొవ్వూరు టోల్ గేట్ దగ్గరకు పెద్ద సంఖ్యలో వారు తరలిరాగా.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమీపంలోని ఇసుక ర్యాంపుల్లో పనిచేసే కార్మికులు.. బీహార్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్‌కి చెందనవారిగా చెబుతున్నారు.