HomeTelugu Newsఏపీ సచివాలయ ఉద్యోగాల పరీక్ష ఫలితాలు విడుదల

ఏపీ సచివాలయ ఉద్యోగాల పరీక్ష ఫలితాలు విడుదల

5 16
ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 20 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఎదురుచూస్తున్న గ్రామ, వార్డు సచివాలయ పరీక్షా ఫలితాలు ఈరోజు సీఎం జగన్ విడుదల చేశారు. ప్రతీ సచివాలయంలో 11 నుంచి 12 మంది శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులను నియమించడమే లక్ష్యంగా మొత్తం 1,26,728 పోస్టుల భర్తీ కోసం సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 8 వరకు
ఏపీ ప్రభుత్వం ఈ పరీక్షలు నిర్వహించింది. 11,158 గ్రామ సచివాలయాల్లో 95,088 పోస్టులను, 3,786 వార్డు సచివాలయాల్లో 36,410 పోస్టులను కేటాయించింది. మొత్తం 21.69 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 19.50 లక్షల మంది పరీక్ష రాశారు. వాటి ఫలితాలు గురువారం విడుదలయ్యాయి.

ఒకే నోటిఫికేషన్‌తో 1,26,728 ఉద్యోగాలు కల్పించి రికార్డ్ సృష్టించామని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అమరావతిలోని సచివాలయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. రికార్డు సమయంలో ఈ యజ్ఞాన్ని పూర్తి చేసినందుకు అధికారులకు అభినందనలు తెలిపారు. ఒకేసారి ఇంతమందికి
ఉద్యోగాలు ఇవ్వడం రికార్డని, ఎన్నికల హామీలో చెప్పినట్టు పెద్ద మొత్తంలో ఉద్యోగాలు ఇచ్చామన్నారు. పరీక్షల్లో విజయం సాధించినవారికి అభినందనలు తెలిపారు. మొత్తం 1,98,164 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో పురుషులు 1,31,327 కాగా, స్త్రీలు 66,835. గ్రామ, వార్డు సచివాలయ ఫలితాలను ఈ కింది వెబ్‌సైట్లల్లో చెక్ చేసుకోవచ్చు.
మహిళా అభ్యర్థుల్లో గరిష్టంగా 112.5 మార్కులు, పురుష అభ్యర్ధుల్లో గరిష్టంగా 122.5 మార్కులు సాధించారు. ఇక రిజర్వేషన్ల పరంగా చూస్తే ఓపెన్, బీసీ కేటగిరిలో అత్యధికంగా 122.5 మార్కులు, ఎస్‌సీ కేటగిరిలో అత్యధికంగా 114 మార్కులు, ఎస్‌టీ కేటగిరిలో అత్యధికంగా 108 మార్కులు పొందారు.

పరీక్షా ఫలితాలు: Click Here

Recent Articles English

Gallery

Recent Articles Telugu