HomeTelugu Trendingఏపీలో సీజ్‌ చేసిన సినిమా థియేటర్లకు ఊరట

ఏపీలో సీజ్‌ చేసిన సినిమా థియేటర్లకు ఊరట

AP govt relief to seized mo

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా థియేటర్ల యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. రాష్ట్రంలోని 9 జిల్లాల పరిధిలో సీజ్‌ చేసిన 83 థియేటర్లను తెరుచుకునేందుకు అనుమతిచ్చింది. దీనికోసం జిల్లా జాయింట్ కలెక్టర్‌ (జేసీ) దరఖాస్తు చేసుకోవాలని మంత్రి పేర్ని నాని సూచించారు. ఈ మేరకు మచిలీపట్నంలో ఆయన ప్రకటించారు. సినీ నటుడు ఆర్‌.నారాయణమూర్తితో పాటు పలువురు థియేటర్‌ యజమానులు ఈరోజు మంత్రిని కలిశారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ అధికారులు గుర్తించిన లోపాలను థియేటర్ల యజమానులు సరిదిద్దుకోవాలని పేర్ని నాని సూచించారు. ఆయా థియేటర్లకు అన్ని వసతులు కల్పించిన తర్వాత నెలరోజుల్లో జేసీకి దరఖాస్తు చేసుకుంటే తిరిగి అనుమతిస్తారని చెప్పారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu