ఏపీలో మద్యం ఉత్పత్తికి అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ అనుమతితో రేపటి నుంచి 20 డిస్టిలరీలు తెరుచుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా మద్యం ఉత్పత్తికి అనుమతి ఇచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే మద్యం తయారీ సంస్థలు వారి కంపెనీలను పూర్తిగా శానిటైజ్ చేయాలని.. ఉత్పత్తి సమయంలో వారు అనుసరించాల్సిన మార్గదర్శకాలు జారీ చేసింది. మద్యం తయరీ సమయాల్లో కార్మికులు తప్పనిసరిగా భౌతికదూరం పాటించాలని సూచించింది. కంపెనీల్లో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు వేర్వేరుగా ఉండాలని తెలిపింది. మద్యం తయారీ కంపెనీల్లో గుట్కా, సిగరెట్లు పూర్తిగా నిషేధించిన ప్రభుత్వం.. కార్మికులు లిఫ్టులు ఉపయోగించరాదని ఉత్తర్వులు జారీ చేసింది.