సూపర్‌స్టార్ మహేష్‌బాబు గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం `సర్కారు వారి పాట` ఈ నెల 12న విడుదల కాబోతున్న మహేష్ `సర్కారు వారి పాట` చిత్రంలో కీర్తిసురేష్ కథానాయికగా నటిస్తుంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. వెన్నెల కిషోర్, సముద్ర ఖని, నదియా, పోసాని కృష్ణ మురళి తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై పాజిటివ్ బజ్ పెరిగింది. తాజాగా సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ పొందింది. సినిమా వ్యవధి 2 గంటల 42 నిమిషాలుగా ఫిక్స్ అయ్యింది.
ఈ నేపథ్యంలో ‘సర్కారు వారి పాట’ సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ ధరలను పెంచాలని కోరుతూ సదరు చిత్ర యూనిట్ చేసిన రిక్వెస్ట్‌కు సానుకూలంగా ఏపీ ప్రభుత్వం రియాక్ట్ కావడం విశేషం. సినిమాను భారీ బడ్జెట్ పెట్టి నిర్మించటం వల్ల ‘సర్కారు వారి పాట’ సినిమాకు 10 రోజుల పాటు రూ.45 రూపాయల టికెట్ ధరను పెంచుకోవచ్చునని తెలియజేసింది.