HomeTelugu Trendingకత్తి మహేశ్‌ చికిత్సకు ఏపీ ప్రభుత్వం సాయం

కత్తి మహేశ్‌ చికిత్సకు ఏపీ ప్రభుత్వం సాయం

AP government sanction 17 l

సినీ నటుడు, విశ్లేషకుడు కత్తి మహేశ్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఆయన చికిత్స కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రూ.17 లక్షల భారీ అర్థిక సాయం విడుదల చేసింది. ఈ మేరకు అధికారికంగా ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీస్‌ నుంచి లేఖను విడుదల చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్‌)నుంచి ఈ నగదు అందించారు.

ఇటీవల నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. మెరుగైన చికిత్స కోసం అతన్ని చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు బలమైన గాయం కావడంతో వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu