Homeపొలిటికల్గ్లాస్‌ చూపిస్తే.. పొలిటికల్‌ ప్రచారమే.. నోటీసులు ఇస్తాం: ఎన్నికల అధికారి

గ్లాస్‌ చూపిస్తే.. పొలిటికల్‌ ప్రచారమే.. నోటీసులు ఇస్తాం: ఎన్నికల అధికారి

Ap ceo about Ustaad Bhagat
ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) ముఖేశ్‌కుమార్‌ మీనా మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటివారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొంటే తీవ్ర చర్యలు ఉంటాయని మరోమారు స్పష్టం చేశారు. ప్రధాని కార్యక్రమంలో భద్రతా లోపాలపై ఫిర్యాదు అందిందని, కేంద్రానికి పంపినట్టు చెప్పారు.

రాష్ట్రంలో 144 సెక్షన్‌ అమలవుతోందని, ఎలాంటి కార్యక్రమం అయినా అనుమతులు తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు సువిధ యాప్‌ ద్వారా అనుమతులు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ భవనాలపై నేతల ఫొటోలు, ప్రకటనలు తొలగించాలని ఆదేశించాం. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులతో కలిసి తిరగకూడదు. ఎప్పటికప్పుడు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తుంది. సీ విజిల్‌ యాప్‌లో నమోదైన ఫిర్యాదులపై 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటున్నాం. సీ విజిల్‌ ద్వారా ఎవరైనా ఫొటో, వీడియో తీసి పంపవచ్చు అన్నారు.

పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్‌పై స్పందించారు. ఈ టీజర్‌ నేను చూడాలేదు. ఒకవేళ గాజు గ్లాసు ప్రచారం చేసిన్నట్లు అయితే పొలిటికల్‌ ప్రకటనగానే వస్తుంది. ఈ అంశంపై నిషేధం లేదు. ఎవరైనా రాజకీయ ప్రకటనలు చేసుకోవచ్చు. అయితే ముందుగా ఈసీ పరిమిషన్‌ తీసుకోవాలి. టీజర్‌ పరిశీలించిన తరువాత అది పొలిటికల్‌ ప్రచారం అనిపిస్తే.. నోటీసుల ఇస్తాం అన్నారు.

డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని వెయ్యికి పైగా ఫిర్యాదులు వచ్చాయి. డీఎస్సీ నియామకంపై ఎన్నికల కమిషన్‌కు పంపిస్తున్నాం. ఈసీ నుంచి అనుమతి వస్తేనే డీఎస్సీ పరీక్ష జరుగుతుంది” అని సీఈవో స్పష్టం చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu