Homeపొలిటికల్AP Elections 2024: మోడీ పర్యటన తర్వాత టీడీపీ, జనసేన వ్యూహం ఏమిటి?

AP Elections 2024: మోడీ పర్యటన తర్వాత టీడీపీ, జనసేన వ్యూహం ఏమిటి?

vijayawada modi road show AP Elections 2024,BJP,Janasena,TDP,Pawan Kalyan,ChandrababuAP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సీపీ అరాచక పాలన అంతమొందించి రాష్ట్ర ప్రజలకు విముక్తి కల్పించాలనే లక్ష్యంతో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. మూడు పార్టీల అధినాయకులు త్రిమూర్తుల్లా ఎన్నికల ప్రచారంలో విజృంభిస్తున్నారు. నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ధాటికి వైసీపీ దడదడలాడుతోంది.

వైఎస్‌ఆర్‌సీపీ అరాచక పాలనను అంతమొందించడమే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్, మోదీతో చేతులు కలిపారు. పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ఈ ముగ్గురు త్రిమూర్తుల్లా ప్రచారంలో దూకుడు పెంచారు. వైఎస్‌ఆర్‌సీపీ పై విరుచుకుపడుతూ ప్రచారం హోరుతో వైఎస్‌ఆర్‌సీపీని బెంబేలెత్తిస్తున్నారు. దీంతో జగన్‌తో పాటు వైఎస్‌ఆర్‌సీపీ నేతల్లో దడ మొదలైంది. ఐదేళ్ల పాటు జగన్ తన పాలనలో చేసిన అరాచకాలను చీల్చి చెండాడుతున్నారు. ముగ్గురు అధినేతలు కలిసికట్టుగా రాష్ట్రం నలుమూలలా పర్యటిస్తున్నారు.

ఏపీలో బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలతో పాటు 6 లోక్‌సభ స్థానాలకు టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తోంది. అయినప్పటికీ అసాధారణ రీతిలో ప్రధాని మోదీ 5 చోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీలోని అగ్రనేతలు ఏపీలో ప్రచార హోరుతో అదరగొట్టేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. ఈ మూడు పార్టీల కలయిక సూపర్ హిట్ అంటున్నారు. అగ్రనేతల నుంచి సాధారణ స్థాయి నేతలవరకు ఒకే మాట ఒకే బాటగా సాగుతున్నారు.

ఎన్డీఏ అభ్యర్థులకు ప్రజలకు అసాధారణమైన మద్దతు లభిస్తోంది. ఏపీలో వైసీపీ పాలనతో విసిగిపోయిన ప్రజలకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆశాకిరణంలా కనిపిస్తోంది. ఎన్డీఏ కూటమి ధాటికి వైఎస్‌ఆర్‌సీపీ కూకటివేళ్లతో పెకలించుకుపోతుందని అంతేకాకుండా కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కూటమి అధికారంలోకి వస్తుందని ఎక్కువమంది అభిప్రాయ పడుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలు గతంలో 2014లోనూ జతకట్టిన సంగతి తెలిసిందే. అప్పుడు సాధించిన విజయాన్ని మళ్లీ పదేళ్ల తర్వాత పునరావృతం చేయబోతున్నాయి.

అంతేకాకుండా వాజ్‌పేయి హయాం నుంచి టీడీపీ, బీజేపీ మధ్య బంధం ఉంది. 2014 ఎన్నికల్లో పొత్తుతో ఈ బంధం మరింత బలపడింది. అప్పటి ఎన్నికల్లో వీరిద్దరి పొత్తులో పవన్ కళ్యాణ్ తోడవడం మరింత కలిసొచ్చింది. కొన్ని కారణాల వల్ల 2019 ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మళ్లీ ఈ మూడు పార్టీలు జతకట్టాయి. కలిసిపోటీచేయడం చారిత్రక అవసరంగా గుర్తించాయి. ఎలాంటి భేషజాలకు పోకుండా పొత్తును పటిష్టం చేయడంలో చంద్రబాబు, పవన్ తమ వంతు కృషి చేశారు. పొత్తు ధర్మం కోసం పవన్ కల్యాణ్ కొంతవెనక్కి తగ్గారు. కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది.

అన్ని స్థానాల్లో పోటీ చేసే సత్తా ఉన్నప్పటికీ పొత్తు ధర్మం కోసం కొన్ని స్థానాల్లోనే పోటీ చేస్తున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ దురాగతాలను అంతం చేయాలనే లక్ష్యంతో వైఎస్‌ఆర్‌సీపీ వ్యతిరేక ఓటును ఎట్టిపరిస్థితుల్లో చీలిపోకూడదనే పవన్ కళ్యాణ్ మొదటి నుంచీ చెప్తున్నారు. అందుకే తన పార్టీలోని నేతలందరికీ టికెట్లు రాకపోయినా తగు న్యాయం చేస్తామని వారిని బుజ్జగించారు. టీడీపీలోని కొందరు నేతలు సైతం టికెట్లు రాక అలకబూనిన సంగతి తెలిసిందే. వ్యతిరేక గళంవినిపించకుండా చంద్రబాబు వారినందరినీ బుజ్జగించారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం, వైఎస్‌ఆర్‌సీపీ దుష్ట పాలనను అంతం చేయడం కోసం పార్టీలోని నేతలు అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని పార్టీకోసం కష్టపడ్డవారికి అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత నాది అని భరోసా ఇచ్చారు.

అయితే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు వల్ల వైఎస్‌ఆర్‌సీపీకి తీవ్ర నష్టం జరుగుతుందని తెలిసిన జగన్ శక్తివంచన లేకుండా ఆ పొత్తు కలవకుండా తీవ్ర ప్రయత్నాలు చేశారు. చంద్రబాబు, జగన్‌పై తీవ్రమైన విమర్శలు చేశారు. వ్యక్తిగత విమర్శలకూ దిగారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ అరాచకాలపై బీజేపీకి స్పష్టత ఉంది. అందుకే టీడీపీ, జనసేనతో పొత్తుకు సై అన్నారు.

సీట్ల సర్దుబాటు, మేనిఫెస్టో.. ఉమ్మడి ఎన్నికల ప్రచారం మొదలు అన్ని అంశాల్లోనూ సమన్వయంతో దూసుకెళ్తున్నారు. ఉమ్మడి మేనిఫెస్టోలో బీజేపీ భాగస్వామి కాకపోవడంపై అపోహలు సృష్టించి పొత్తును విడగొట్టాలని వైఎస్‌ఆర్‌సీపీ తీవ్రంగా ప్రయత్నించింది. అయితే వైఎస్‌ఆర్‌సీపీ కుట్రలను బీజేపీ సహ ఇన్‌ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్ తిప్పికొట్టారు. కేంద్రంలో ఎన్డీఏ మేనిఫెస్టో విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలతో కలిసి పోటీ చేస్తున్న రాష్ట్రాల మేనిఫెస్టోల్లో బీజేపీ భాగస్వామ్యం కావడం లేదని వివరంగా చెప్పారు. అందుకే టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి బీజేపీ తరపున సిద్ధార్థనాథ్ సింగ్ హాజరయ్యారు.

టీడీపీ, జనసేన, బీజేపీ అగ్ర నాయకులు తమ పార్టీ తరపున అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారా.. లేదా అనే విషయాన్ని పక్కనపెట్టి ఎన్డీఏ గెలుపే లక్ష్యంగా ప్రచారం హోరెత్తిస్తున్నారు. చిలకలూరిపేట, రాజమండ్రి, అనకాపల్లి, కలికిరి సభలతో పాటు విజయవాడ రోడ్‌షోలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ రోడ్‌షోకు ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌న ల‌భించింది. విజ‌య‌వాడ‌లోని ఇందిరాగాంధీ మునిసిప‌ల్ స్టేడియం నుంచి బెంజ్ స‌ర్కిల్ వ‌ర‌కు .. సుమారు నాలుగు కిలో మీట‌ర్ల మేర నిర్వ‌హించిన ప్ర‌ధాని రోడ్‌ షోలో చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు పాల్గొన్నారు.

అదేవిధంగా కూటమి పార్టీల నేత‌లు కూడా పాల్గొన్నారు. ఐదుగురు ఎస్పీలు, 5 వేల మంది పోలీసుల‌తో భ‌ద్ర‌తను ఏర్పాటు చేశారు. ఆసాంతం.. ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌ట‌న‌కు విశేష స్పంద‌న ల‌భించింది. ఇది రాజ‌కీయంగా కూట‌మి పార్టీల‌కు జోష్ నింపింది. మ‌రో నాలుగు రోజుల్లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే జ‌రిగి ప్ర‌చారానికి తోడు ఈ రోడ్ షో మ‌రింత ఊపు తెచ్చింద‌నే చ‌ర్చ సాగుతోంది. దీనిపై ఎక్కువ మంది ఆస‌క్తి చూపించ‌డం గ‌మ‌నార్హం. దీంతో కూటమి గెలుపు ఖాయం అనే చర్చ జరుగుతుంది. నరసరావుపేట లోక్‌సభ స్థానం పరిధిలో బీజేపీ అభ్యర్థులెవరూ పోటీలో లేకపోయినప్పటికీ చిలకలూరిపేటలో జరిగిన ఎన్డీఏ సభకు ప్రధాని మోడీ హాజరయ్యారు.

శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరం సభకు అమిత్‌ షా హాజరై వైఎస్‌ఆర్‌సీపీ విధానాలను ఎండగట్టారు. బీజేపీ అగ్రనేతలైన నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. రేపల్లె, పొన్నూరు వంటి ప్రాంతాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీలో లేకపోయినా పవన్ కల్యాణ్ అక్కడ ప్రచారం చేశారు. తిరుపతి లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు బరిలో లేకున్నా పవన్ కల్యాణ్‌తో కలిసి చంద్రబాబు ప్రచారంలో పాల్గొన్నారు. రాజమండ్రి, రైల్వేకోడూరులో ఎన్నికల ప్రచారానికి ఇద్దరూ కలిసి వెళ్లారు. బీజేపీతో కలిసి పోటీచేస్తున్నప్పటికీ రాష్ట్రంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు అమలు, మసీదుల నిర్మాణానికి అవసరమైన సహకారం వంటి అంశాలకు కట్టుబడి ఉన్నామని టీడీపీ తన విధానాన్ని విస్పృష్టంగా ప్రకటించింది.

రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు , విధ్వంసకాండపై మొదట చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ కృష్ణార్జునుల్లా సమరశంఖం పూరించారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు రాత్రికి రాత్రే జరగలేదు. అనేక సమావేశాల తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు. జగన్‌ను ఎదుర్కొవాలనే స్థానికంగా కలిసి పోటీకి దిగారు. ఈ క్రమంలో ఎన్నికల్లో కొన్ని చోట్ల జనసేన, టీడీపీ క్షేత్రస్థాయిలో అవగాహనతో పని చేశారు.

పవన్‌ కళ్యాన్‌ను విశాఖలో పోలీసులు తీవ్రస్థాయిలో ఇబ్బంది పెట్టారు. నగరంలో తిరగకుండా చేశారు. ఆతరువాత విజయవాడలో పవన్‌ కళ్యాణ్‌ బస చేసిన హోటల్‌కి చంద్రబాబు స్వయంగా వెళ్లి సంఘీభావం తెలియజేశారు. అనంతరం నేతల మథ్య మూడు సమావేశాలు జరిగాయి. చంద్రబాబుని అరెస్టు చేసినప్పుడు పవన్‌ కళ్యాణ్‌ అందించిన స్నేహహస్తం రెండు పార్టీల మైత్రికి కీలక మలుపు. రాజమండ్రి జైలుకు వెళ్లి చంద్రబాబుని కలిసి బయటి వస్తూనే రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికే బీజేపీ జనసేన మిత్రపక్షంగా ఉన్నప్పటికీ.. రాష్రంలో పరిస్థితలు దృష్ట్యా టీడీపీలో కలవాలని నిర్ణయించుకున్నారు. బీజేపీ కూడా తమతో కలిసి వచ్చేలా పవన్‌కళ్యాణ్‌ కృషి చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu