ఆంధ్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ కౌంటింగ్ మొదలయింది. 175 కాన్స్టిట్యూఎన్సీస్ లో.. గెలిచేది ఎవరు.. ఓడేది ఎవరు అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఈ క్రమంలో ఏపీ ప్రజలు మాత్రం తమ సీఎం ఎవరు అనే విషయంపై ఫుల్ క్లారిటీగా ఉన్నారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బిజెపి కలిసి ఏర్పరచుకున్న కూటమి వల్ల.. ఈసారి సీఎం కాబోయేది చంద్రబాబు నాయుడే అని ఎప్పుడో క్లారిటీ వచ్చేసింది. కానీ కౌంటింగ్ వరకు వేచి చూడాలి కాబట్టి.. ప్రజలు ఇంకా వేచి చూస్తున్నారు. అయితే రిజల్ట్స్ మాత్రం టిడిపికి అనుకూలంగా రావడం తథ్యం కాబట్టి.. టిడిపి నేతల్లో అప్పుడే పండగ వాతావరణం నెలకొంది.
ముఖ్యంగా జనసేన సభ్యులు.. తాము పోటీ చేసిన 21 స్థానాల్లో గెలుస్తాము అన్న నమ్మకంతో ఫంక్షన్స్ చేసుకుంటున్నారు. ఇదంతా బాగానే ఉన్నా అసలు సమస్య ఇప్పుడు మన జగన్ ముందర ఉంది. తాము ఎలా ఓడిపోతామని తెలిసి.. ఎలక్షన్స్ అయిన తరువాత రోజు నుంచే అల్లర్లు మొదలుపెట్టారు వైసిపి నేతలు. తమ ఫ్రస్ట్రేషన్ అంతా తోటి సభ్యుల పైన చూపించారు. ఇక జగన్ కూడా ఆ రేంజ్ ఫ్రస్టేషన్లో ఉన్నట్టు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ బాయ్ బాయ్ జగన్ అన్నడంతో…ప్రస్తుతం చెప్పలేనంత ఫ్రస్టేషన్ లో ఉన్నారు మన జగన్ అన్న. ఇక ఫలితాలు అన్నీ బయటకు వచ్చాక.. తక్కువ మెజార్టీతో టీడీపీ గెలిచే సరే కానీ.. ఎక్కువ మెజార్టీతో గెలిస్తే మన జగన్ అన్న ఫ్రస్టేషన్ రెట్టింపు కావడం ఖాయం. ఈ ఫ్రస్టేషన్లో సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి మన జగనన్న ఏం మాట్లాడతాడో వేచి చూడాలి.