AP elections 2024: ఆంధ్రప్రదేశ్ లో అనుకుందే జరిగింది. నిజం చెప్పాలంటే అనుకున్న దానికన్నా ఎక్కువే జరిగింది. టిడిపి కూటమి చేతిలో వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీ తప్పకుండా ఓడిపోతుందని ఎప్పుడో ఫిక్స్ అయ్యారు. కానీ ఏదో కొంచెం మెజారిటీ డిఫరెన్స్ తో ఓడిపోతారు అనుకున్నారు వైసీపీ నేతలు.
అయితే ఎవరు ఊహించని విధంగా భారీ మెజారిటీ డిఫరెన్స్ తో…చిత్తుచిత్తుగా ఓడిపోవడానికి సిద్ధమయ్యింది వైసిపి. భారీ మెజారిటీతో టీడీపీ, జేఎస్పీ, బీజేపీ కూటమి దూసుకుపోతుండగా.. వైసిపి మెజారిటీ చటికిల పడిపోయింది.
175 స్థానాల్లో కనీసం 25 స్థానాలు కూడా వైసీపీ దక్కించుకునేలా కనిపివ్వడం లేదు. ఈ క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రజల్లో వైసీపీ పట్ల ఉన్న నిరాశ అర్థమవుతుంది. జగన్ ఈ ఐదు సంవత్సరాలలో చేసిందేమీ లేదు. కేవలం చంద్రబాబు నాయుడుని, పవన్ కళ్యాణ్ ని దూషించడం తప్ప. ఏవో కొన్ని ప్రజలకు ఫ్రీగా.. ఇచ్చేస్తే చాలు ఓట్లు వేసేస్తారు అనుకున్నాడు ఈ నాయకుడు.
కానీ ఆంధ్ర ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు కాదు.. అభివృద్ధికి ఓటేసే వాళ్ళని ఈ ఎలక్షన్స్ రుజువు చేశాయి. మొత్తానికి కూటమి దెబ్బకి ఫ్యాన్ రెక్కలు ఎక్కడపడితే అక్కడ పడిపోయాయి. సైకిల్ విరిగిపోద్ది..గ్లాస్ పగిలిపోద్ది అనుకున్న వైసీపీ నేతలకు ఫ్యాన్ రెక్కలు చెల్లాచెదురు కావడంతో.. రియాలిటీ అర్థమైంది.