AP election results: దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ స్థానాలకు.. మొన్నటి వరకు ఎలక్షన్ జరిగిన సంగతి తెలిసిందే. కాగా మొన్నటితో మొత్తం ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఈ క్రమంలో జూన్ 2వ తేదీ సాయంత్రం ఎగ్జిట్ పోల్ సర్వేలు వెలుబడ్డాయి. అయితే ఈ సర్వేల తరువాత ఆంధ్ర ప్రజలకు ఒక పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఈ ఐదు సంవత్సరాలు తాము పడిన బాధలకు కొద్ది రోజుల్లో శుభం కార్డు పడునుండి అని హామీ ఇచ్చాయి ఈ సర్వేలు…అది ఎలాగా అంటే.. ఆంధ్రప్రదేశ్లో ఈసారి వైయస్సార్సీపీకి ఓతమి తప్పదు అని తేల్చి చెప్పడంతో.. ఆంధ్ర ప్రజలకు ఉరత కలుగుతోంది.
అసలు విషయానికి వస్తే మెజారిటీ సర్వేలు.. ఏపీలో తెలుగు దేశం కూటమిదే అధికారం అంటున్నాయి. ఇదంతా మనకు తెలిసిన విషయమే అయినా.. ఇందులోని ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే.. వైయస్సార్సీపీలో మొన్నటి వరకు తెగ విర్రవీగిన కొంతమంది.. మెజారిటీ మంత్రులు.. ఈ సారి ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయం అని ఈ సర్వేలు చెప్పడం.
నిన్న మొన్నటి వరకు.. మీడియా ముందర కొంతమంది వైయస్సార్సీపి నేతలు చేసిన హడావిడి అంతా..ఇంతా.. కాదు. ఈ ఐదు సంవత్సరాలు తమకు వచ్చిన బూతులన్నీ మాట్లాడారు ఈ నేతలు. ఇలా విర్రవీగిన వారందరికీ ఈసారి ఓతమి తప్పేలా లేదు.
ముఖ్యంగా ఈ సారి వైయస్ఆర్సీపీకి చెందిన పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా.. నగరి నుంచి ఓడిపోవడం ఖాయం అంటున్నాయి సర్వేలు. వైసీపీ గెలుస్తుందన్న ఆరా వంటి సంస్థలు కూడా.. రోజా నగరిలో హాట్రిక్ కొట్టడం డౌటే అంటున్నాయి. ఈసారి ఎన్నికల్లో తన సమీప తెలుగు దేశం పార్టీ అభ్యర్ధి గాలి భాను ప్రకాష్ చేతిలో ఓటమి పాలు కావడం.. ఖాయం అంటున్నాయి సర్వే సంస్థలు.
ఇక వైసీపీలో తనకి నోరు ఉంది కదా అని విపరీతంగా మాట్లాడే ఇంకో లీడర్ అంబాటి రాంబాబు. ఇక మంత్రి అంబటి రాంబాబు ఈ సారి సత్తెనపల్లిలో తెలుగు దేశం పార్టీ అభ్యర్ధి కన్నా లక్ష్మీ నారాయణ.. చేతిలో ఓటమి పాలు కావడం ఖాయం అంటున్నాయి సర్వేలు. ఇక వైయస్ఆర్సీపీకి చెందిన మాజీ మంత్రి కొడాలి నాని కూడా ఈ సారి గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా పరాభవం తప్పదని సర్వేలు చెబుతున్నాయి. మొత్తానికి నిన్న మొన్నటి వరకు..తమ గెలుపుని చూసుకొని ఏది పడితే అది వాగిన ఈ ముగ్గురికి.. ఇక ముందుంది ముసళ్ళ పండగ.. అని వ్యతిరేక పార్టీ వాళ్లు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.