Homeపొలిటికల్AP Election 2024: చివరి నిమిషంలో జగన్‌కు షాకిచ్చిన తల్లి విజయమ్మ!

AP Election 2024: చివరి నిమిషంలో జగన్‌కు షాకిచ్చిన తల్లి విజయమ్మ!

AP Election 2024AP Election 2024: ఎన్నికల ప్రచారం చివరి రోజు ఊహించని ట్విస్టులు ఎదురౌతున్నాయి. అల్లు అర్జున్‌ పవన్‌ కళ్యాణ్‌కి కాకుండా.. వైసీపీకి ప్రచారం చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా ఏపీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి పెద్ద షాక్ తగిలింది.

తన చెల్లి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లోక్ సభ ఎన్నికల్లో కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్‌ను టార్గెట్‌ చేస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేస్తుంది. అయితే వారి తల్లి వైఎస్ విజయమ్మ మాత్రం ఎవరికి మద్దతు ఇవ్వలేదు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో ఆమె విదేశాలకు వెళ్లిపోయింది.

ప్రస్తుతం అమెరికాలో ఉన్న విజయమ్మ ఎవరి వైపు ఉంటుందో ఇప్పటి వరకూ తెలియదు. అయితే తాజాగా ఆమె ఓ వీడియో విడుదల చేశారు. షర్మిల గెలుపు కోసం ఆమె తల్లి వైఎస్ విజయమ్మ కడప లోక్ సభ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ప్రత్యేక సందేశం చేశారు.

“వైఎస్ ను అభిమానించేవారికి, ఆయనను ప్రేమించేవారికి, యావత్ కడప లోక్ సభ నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు. రాజశేఖర్ రెడ్డి గారిని మీరు ఏ విధంగా అక్కునచేర్చుకున్నారో, ఏవిధంగా నిలబెట్టారో, ఆవిధంగానే ఆయన కూడా ఊపిరి ఉన్నంతవరకు మీ కోసం ప్రజాసేవలో అంకితమయ్యారు. ప్రజాసేవలోనే ఆయన చనిపోయారు.

ఇవాళ ఆయన ముద్దుబిడ్డ షర్మిలమ్మ కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తోంది. ఇవాళ ఆ బిడ్డను గెలిపించి పార్లమెంటుకు పంపించాలని ప్రార్థిస్తున్నాను. నాడు రాజశేఖర్ రెడ్డి గారిని ఆదరించినట్టే నేడు కడప ప్రజలు షర్మిలను కూడా ఆదరించాలి. వైఎస్ లా కడప ప్రజలకు సేవ చేసే అవకాశం షర్మిలకు కూడా కల్పించాలి” అని విజయమ్మ విజ్ఞప్తి చేశారు.

కూతురు షర్మిలకు మద్దతు ప్రకటించడం వైఎస్ జగన్‌కు విజయమ్మ బిగ్ షాకిచ్చినట్టు అయ్యింది. అవినాశ్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిలకు వ్యతిరేకంగా వైయస్ విజయమ్మ వీడియో విడుదల చేయడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కన్న తల్లే జగన్‌ను నమ్మడం లేదంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ కనిపిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu