అమరావతిలో చంద్రబాబుతో కలిసి పర్యటించిన ఆయన సతీమణి భువనేశ్వరి ఆమె చేతికి ఉన్న బంగారు గాజులను రాజధాని రైతులకు అందించారు. ఈ విషయంపై స్పందించిన డిప్యూటీ సీఎం సచివాలయంలో మాట్లాడుతూ భువనేశ్వరి ఇవ్వాల్సింది గాజులు కాదు అన్యాయంగా తీసుకున్న రైతుల భూములని ఆరోపించారు. రాజధానిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరుతో భూములు కొట్టేసింది మీ భర్త చంద్రబాబు కాదా అని భువనేశ్వరిని ప్రశ్నించారు. అంతేకాక హెరిటేజ్ పేరుతో రాజధానిలో ఉన్న భూములపై భువనేశ్వరి లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. హెరిటేజ్ పేరుతో ఉన్న 14.22 ఎకరాల భూములను రైతులకు ఇచ్చేయాలని ఆమె డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు 4 వేల ఎకరాలు దోచేసింది నిజం కాదా అని నిలదీశారు. ఆ 4వేల ఎకరాలు రైతులకిస్తే మీరు ఇచ్చిన గాజులకంటే ఎక్కువ మేలు చేస్తాయని అన్నారు.