ఏపీ సీఎం జగన్ కరోనా టెస్ట్ చేయించుకున్నారు. దక్షిణ కొరియా దేశం నుండి ఆంధ్రప్రదేశ్ లక్ష కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను దిగుమతి చేసుకున్న సందర్భంగా జగన్ తన కార్యాలయంలో కిట్లను ప్రారంభించారు. ఈ కిట్ ను ఉపయోగించి కేవలం 10నిమిషాల్లోనే కరోనాను నిర్ధారించవచ్చు. కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వం కిట్లను దిగుమతి చేసింది. ఈ కిట్లను ఉపయోగించి జిల్లాల్లో కరోనా ప్రభావిత ప్రాంతాల్లో పరీక్షలు చేయనున్నారు. కాగా డాక్టర్లు మొదట ఈ కిట్ ను ఉపయోగించి జగన్ కు కరోనా పరీక్షలు నిర్వహించారు. 10 నిమిషాల తరవాత వచ్చిన రిపోర్ట్ లో సీఎం కు కరోనా నెగిటివ్ వచ్చింది. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను ఉపయోగించి త్వరలోనే కరోనా కు బ్రేక్ వేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.