ఏపీ సీఎం జగన్.. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంతంలో ఉద్యమం ఉద్ధృతమైన నేపథ్యంలో రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
” ప్రతి నిర్ణయానికి ప్రాతిపదిక.. అందరూ బాగుండాలి.. అన్ని ప్రాంతాలు బాగుండాలి. గ్రామం నుంచి రాష్ట్రం పరిపాలన వరకు అందరూ సమానమే. అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, పరిపాలన ఫలాలు అందాలి. గతంలో అన్యాయంగా తీసుకున్న నిర్ణయాలను సరిదిద్దుతాం. అన్న దమ్ముల్లా అన్ని ప్రాంతాలు ఉండేలా ఈ పదవిని అందరి అభివృద్ధికి వినియోగిస్తా. అందరికీ నీరు, నిధులు, పరిపాలన దక్కితేనే న్యాయం” అని సీఎం జగన్ అన్నారు.