కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం ఢిల్లీలోని రాహుల్ నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈవీఎంలు, వీవీప్యాట్ అంశాలతో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల తీరు, ఏపీలో ఎన్నికల అనంతర పరిణామాలు, వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై సుప్రీంకోర్టు తీర్పు, ఈవీఎంల విషయంలో ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు, ఐదు దశల్లో ఎన్నికల ట్రెండ్ ఎలా ఉంది తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ సరళిపై ఇరువురు నేతలకు వచ్చిన నివేదికలపై పరస్పరం చర్చించికున్నట్లు సమాచారం. ఎన్నికలు పూర్తయిన తర్వాత అనుసరించాల్సిన వ్యూహం, తదుపరి భేటీ, తాజా రాజకీయ పరిస్థితులపై దాదాపు 20 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. నిన్న సాయంత్రమే రాహుల్‌తో చంద్రబాబు భేటీ కావాలని భావించినా… ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో ఇవాళ ఉదయం సమావేశమయ్యారు.