![AP Cabinet సంచలన నిర్ణయాలు.. త్వరలో అమలుకానున్న కొత్త పథకాలు! 1 AP Cabinet decides to launch New Schemes soon?](https://www.klapboardpost.com/wp-content/uploads/2025/01/New-Project-2025-01-18T130917.143.jpg)
AP Cabinet New Schemes:
తాజాగా జరిగిన AP Cabinet సమావేశంలో పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. పూర్వ ప్రభుత్వం హయాంలో నిషేధిత జాబితా నుంచి తొలగించబడిన 7 లక్షల ఎకరాల భూములపై సర్వే చేసి నివేదిక సమర్పించాలని నిర్ణయించారు.
పేదలకు భూకేటాయింపు:
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదలకు భూమి అందించడంపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల భూమి, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల భూమిని అర్హులకు కేటాయించాలని అధికారులను ఆదేశించారు.
సంక్షేమ పథకాలపై ఫోకస్:
అదేవిధంగా, కొత్త ఆర్థిక సంవత్సరంలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా వంటి పథకాలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.
పోలవరం, అమరావతి అభివృద్ధి:
పోలవరం డయాఫ్రామ్ వాల్ నిర్మాణం త్వరగా మొదలుపెట్టాలని, అమరావతి అభివృద్ధి పనులు పునఃప్రారంభించాల్సిన అవసరం ఉందని కేబినెట్ పేర్కొంది.
ఉద్యోగులు, పారిశ్రామిక రంగానికి అనుకూల నిర్ణయాలు:
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రేషన్ సమస్యలపై చర్చ జరిగింది. ఫెరోఅలాయ్ పరిశ్రమలకు విద్యుత్ సుంకాన్ని తగ్గించడం, కడపలో 2,595 ఎకరాల APIICకి బదిలీకి స్టాంపు డ్యూటీ మినహాయింపు అందించడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు.
రైతులకు పెద్ద ఊరట:
ఈ సీజన్‌లో రూ. 6,200 కోట్లను రైతుల ఖాతాల్లోకి బదిలీ చేశారు. 28.83 లక్షల టన్నుల వరి సేకరణ పూర్తయిందని తెలిపారు.
స్వచ్ఛ ఆంధ్రపదేశ్:
ప్రతి నెలా 18వ తేదీన స్వచ్ఛ దివస్ జరపాలని నిర్ణయించారు. విజయవాడ అభివృద్ధికి రూ. 294 కోట్లు మంజూరు చేశారు.