ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ, ప్రతిపక్ష బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పరస్పరం విమర్శలతో ట్వీట్ల వార్ జరుగుతోంది. కరోనా కిట్ల వ్యవహారంలో ఇరు పార్టీల నాయకుల మధ్య ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇప్పటికే కన్నా లక్ష్మీనారాయణపై ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు సూట్‌కేసుల రెడ్డి అని సంభోదిస్తూ ఏపీ బీజేపీ గట్టి కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా విజయసాయిపై ఉన్న కేసుల వివరాలను ట్విట్టర్‌లో ఉంచింది. కరోనాతో ఇప్పుడు రాష్ట్రం క్వారంటైన్‌లో ఉంటే.. విజయసాయిరెడ్డి తాను చేసిన పనులతో 2012 లోనే క్వారంటైన్‌లో ఉన్నారని వ్యాఖ్యలు చేసింది. ఉన్న పరువును మీ పైత్యంతో పోగొట్టుకోవద్దంటూ హితవు పలికింది.
సూట్ కేసు రెడ్డి,
కాస్త కళ్ళజోడు తుడుచుకుని పెట్టుకుని చూడండి ఇది ఏపీ బిజెపి..
కరోనా వచ్చి రాష్ట్రం ఇప్పుడు క్వారంటేయిన్లో ఉంటే తమరు చేసినపనులకు 2012లోనే మీరు క్వారంటేయిన్లో ఉన్నారు.
ఈ కిందవి మీడిగ్రీలు కాదు తమరి “నేర ఘనతలు”..పైత్యంతో ఉన్న కొద్ది పరువునూ తీసుకోకండి.@VSReddy_MP pic.twitter.com/CUmUGUiIKK— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) April 20, 2020