హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచు పలు సామాజిక అంశాలపై చర్చిచే ఈ బ్యూటీ తాజగా ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌పై స్పందించింది. ఆన్‌లైన్ విద్యావిధానాన్ని తప్పుబట్టింది. చిన్న వయసు వారు ఇలా గంటల తరబడి ఫోన్‌లు, ల్యాప్‌ట్యాప్‌లు చూస్తుంటే వారి కళ్లు పాడైపోతాయని పేర్కొంటూ ట్వీట్ చేసింది. 10 సంవత్సరాల లోపు పిల్లల విద్యావిధానం విషయమై ఆన్‌లైన్ కాకుండా వేరే పద్దతి ఏదైనా ఆలోచించండని ప్రభుత్వానికి సూచించింది. దీంతో అనసూయ ట్వీట్ చూసిన నెటిజన్స్ ఈ ఇష్యూపై మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
Am I the only one who is a worried parent.. 5-6 hours of continuous exposure to electronic display screens.. at such vulnerable age.. we have to come up with another alternative to educate kids below 10 years during this pandemic..😣😣
— Anasuya Bharadwaj (@anusuyakhasba) June 11, 2020