HomeTelugu Trendingవారికి అక్క చెల్లెళ్లు, పిల్లలు ఉండరా: అనుష్క

వారికి అక్క చెల్లెళ్లు, పిల్లలు ఉండరా: అనుష్క

7 20

స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శెట్టి సీనీ పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందని అన్నారు. కానీ, తనకు ఎప్పుడూ అటువంటి అనుభవం ఎదురుకాలేదని ఆమె తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

ప్రముఖ నటి అనుష్క నటించిన తాజా చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించారు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా నిర్మించాయి. అంజలి, షాలినీ పాండే, మాధవన్‌, సుబ్బరాజు కీలక పాత్రలు పోషించారు. ‘ఏప్రిల్‌ 2’న ఈ చిత్రం విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

దీని ప్రచారంలో భాగంగా అనుష్క మీడియాతో మాట్లాడారు. తెలుగు చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి ప్రశ్నించగా.. ‘ఇక్కడ క్యాస్టింగ్‌ కౌచ్‌ లేదని నేను చెప్పను. కానీ అదృష్టవశాత్తూ నాకెప్పుడూ అలాంటి చేదు అనుభవం ఎదురుకాలేదు అని అన్నారు. ఎందుకంటే నేను చాలా ముక్కుసూటిగా మాట్లాడుతుంటా. ఎవరైనా సరే.. ఓ మహిళ నుంచి ఇలాంటి ప్రతిఫలం ఆశించడం తప్పు. నాకు తెలిసి ఇది ఒకరి వ్యక్తిగత అభిప్రాయం. చిత్ర పరిశ్రమలో అతి సులభంగా రాణించాలా?, కష్టపడి నిలదొక్కుకోవాలా?.. ఇలాంటి విషయాల్ని మనం ఆలోచించుకోవాలి. ఎప్పుడైతే మహిళ నో చెబుతుందో.. అప్పుడే పురుషుడు మహిళల్ని గౌరవించడం ప్రారంభిస్తాడు’ అని చెప్పారు.

అయితే ఇప్పటికే అనుష్క ప్రేమ, వివాహం గురించి అనేక వదంతులు వచ్చాయి. వీటిపై ఆమె స్పందిస్తూ.. ‘వదంతులనేవి చిత్ర పరిశ్రమలో చాలా సాధారణం. ఈ విషయంలో నేనేం చేయలేను. కానీ నాపై అలాంటి వార్తలు ఎందుకు రాస్తుంటారో నాకు అర్థం కాదు. నాపై వదంతులు రాసిన వారికి అక్క చెల్లులు, పిల్లలు ఉండరా.. అని ఆశ్చర్యపోతుంటా’ అని చెప్పారు. టీవీ చూడటం, పత్రికలు చదవడం తనకు అలవాటు లేదని.. స్నేహితులు పంపించిన మెసేజ్‌ల ద్వారా తనపై వచ్చిన పుకార్ల గురించి తెలుసుకుంటుంటానని ఆమె పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu