స్టార్ హీరోయిన్ అనుష్క పెళ్లి విషయం ఎప్పుడు వైరల్ అవుతునే ఉంటుంది. గతంలో ప్రభాస్‌ను ఈ భామ పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. అప్పట్లో ఆ ప్రచారాన్ని ఆమె కొట్టిపారేసినా తర్వాత ఆమె పెళ్లి గురించి ప్రచారం గాసిప్స్ మాత్రం ఆగలేదు. అయితే తాజాగా ఆమె తన పెళ్లిపై ఓ క్లారిటీ ఇచ్చింది బ్యూటీ.
అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘నిశ్శబ్దం’ సినిమా ప్రచారంలో భాగంగా ఆమె పలు విషయాలు అభిమానులతో పంచుకుంది. ‘నేను పెద్దవాళ్లు చూపించిన వాడినే పెళ్లి చేసుకుంటా. ప్రస్తుతం ఎవరితోనూ ప్రేమలో లేను. నేను ప్రేమలో ఉన్నట్లు తరచూ వార్తలు వినిపిస్తుంటాయి. అవి నాకు చాలా బాధకలిగిస్తాయి. అలాంటి వార్తల్లో ఏమాత్రం నిజం లేదు’ అని పేర్కొంది.