HomeTelugu Big Storiesఫ్లాష్‌.. దర్శకేంద్రుడుకి కోడలు కాబోతున్న అనుష్క?

ఫ్లాష్‌.. దర్శకేంద్రుడుకి కోడలు కాబోతున్న అనుష్క?

10 24
టాలీవుడ్‌ బ్యూటీ అనుష్క పెళ్లి ఎప్పుడూ.. హాట్‌ టాపిక్‌ గానే ఉంటుంది. తరచు ఈమె పెళ్లికి సంబంధించి ఏదో ఒక గాసిప్‌ బయటకు వస్తోంది. ఒకప్పుడు అనుష్క, గోపీచంద్ కాంబినేషన్‌లో ‘శౌర్యం’ సినిమా వచ్చింది. ఆ సమయంలో వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారనే వార్తలు వచ్చాయి. అవీ గాలి కబుర్లు గానే మిగిలిపోయాయి. తరువాత యంగ్ రెబల్‌ స్టార్ ప్రభాస్‌, అనుష్కకు మధ్య ఎఫైర్‌ ఉన్నట్లు సృష్టించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘బిల్లా’, ‘మిర్చి’, ‘బాహుబలి’ సినిమాలు వచ్చాయి. కాగా ప్రభాస్ ఏ హీరోయిన్‌తోనూ మూడు సినిమాలు చేయలేదు. తొలిసారి అనుష్కతో మూడు సినిమాల్లో నటించడంతో ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. తెర పై వీరి కెమీస్ట్రీ, ‘బాహుబలి’లో లిప్ కిస్ సీన్ చూసి అభిమానులు వీరిని లవర్స్ చేశారు. వచ్చే నెలలో పెళ్లి, వచ్చే ఏడాది పెళ్లి అంటూ ఎవరికి వారు ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నారు. చివరకు ప్రభాస్‌కు కూడా చిరాకు వచ్చేసింది. ఓసారి కాస్త గట్టిగా రియాక్ట్ అయ్యారు కూడా.

10b 1

దానితో బోర్‌ కొట్టిన ఫ్యాన్స్‌ కాస్త వెరైటీగా క్రికెటర్‌తో లింక్ పెట్టేసారు. కాగా ఈ విషయంపై స్వీటీ స్పందించింది. ఇలాంటి రూమర్స్ రాసేముందు క్లారిటీగా తెలుసుకోవాలని, తన పెళ్లి బాధ్యత పూర్తిగా తన తల్లిదండ్రులకే అప్పగించేసానని స్పష్టం చేసేసింది. అయితే మన గాసిప్‌రాయుళ్ళు ఉరుకుంటారా.. తాజాగా మరో ఆసక్తికర వార్తను పుట్టించారు.. అనుష్క ఆ లెజండరీ దర్శకుడికి కోడలు కాబోతుంది అంటు వార్తలు వస్తున్నాయి.

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనయుడు కేయస్ ప్రకాశ్‌ను అనుష్క పెళ్లాడబోతుందని అంటున్నారు. గతంలో ఈ ఇద్దరూ సైజ్ జీరో సినిమాకు పనిచేసారు. కాగా ప్రకాశ్‌కు ఇదివరకే కనిక థిల్లాన్ అనే బాలీవుడ్ రైటర్‌తో పెళ్లి, విడాకులు కూడా అయ్యాయి. అతన్ని అనుష్క రెండో పెళ్లి చేసుకుంటుందంటూ వార్తలొస్తున్నాయి. ఈ వార్తపై అనుష్క స్పందన ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం కోన వెంక‌ట్ నిర్మాణంలో ‘నిశ్శబ్ధం’ సినిమా చేస్తుంది ఈ భామ‌.

10a 2

Recent Articles English

Gallery

Recent Articles Telugu