HomeTelugu Big Storiesమెరిసిన స్వీటీ.. ట్రెండింగ్‌లో స్టిల్స్‌

మెరిసిన స్వీటీ.. ట్రెండింగ్‌లో స్టిల్స్‌

12 7స్టార్‌ హీరోయిన్‌ అనుష్క చాలా రోజుల తర్వాత అభిమానులకు దర్శనమిచ్చారు. ఆమె తాజా ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. అనుష్క ఈజ్‌ బ్యాక్‌ అంటూ అభిమానులు తెగ ఆనంద పడిపోతున్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం ట్విటర్‌ ట్రెండింగ్‌లో ఉన్నాయి. అనుష్క స్టిల్స్‌ను ఫ్యాన్స్‌ విపరీతంగా షేర్‌ చేస్తున్నారు. స్వీటీ తెలుపు వర్ణం దుస్తుల్లో సముద్రం ఒడ్డున కూర్చుని ఎంతో అందంగా కనిపించారు. ఫొటోగ్రాఫర్‌ సుందర్‌ రాము ఈ ఫొటోల్ని క్లిక్‌ మనిపించారు. అంతేకాదు ఈ ఫొటోల్లో ఆమె మునుపటికంటే నాజూకుగా కనిపించారు.

అనుష్క ‘సైజ్‌జీరో’ సినిమా కోసం బరువు పెరిగారు. తర్వాత క్రమక్రమంగా బరువు తగ్గుతూ వచ్చారు. ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ బ్లాక్‌బస్టర్‌ తర్వాత గత ఏడాది ఆమె ‘భాగమతి’తో ఆకట్టుకున్నారు. దీని తర్వాత ట్రీట్‌మెంట్‌ కోసం అనుష్క అమెరికా వెళ్లి, వచ్చారట. ఈ క్రమంలోనే ఆమె సినిమాలకు దూరం అవుతున్నారని వదంతులు వచ్చాయి. చాలా రోజుల తర్వాత ఇటీవల ఆమె ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్. రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహంలో కనిపించారు.

మార్చి నెలలో అనుష్క కొత్త ప్రాజెక్టు ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాకు హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించబోతున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మాధవన్‌, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాసరావు తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించబోతున్నారు. ఈ చిత్రానికి ‘సైలెన్స్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu