టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క.. పెళ్లికాని ముదురు భామల లిస్ట్ లో ముందుంటుంది. ఇక ఈ భామ పెళ్లి గురించి నిత్యం ఏదో ఒక వార్త హల్చల్ చేస్తూనే ఉంటుంది. తాజాగా అనుష్క పెళ్లి గురించి ఎప్పుడూ వినని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విరాల్లోకి వెళ్లితే..
అనుష్క త్వరలో టీమిండియా క్రికెటర్ ను వివాహమాడనుందని ఆ వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మధ్య యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో అనుష్క ప్రేమలో ఉందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అలాంటిదేమి లేదని క్లారిటీ వచ్చింది. ఆ తరువాత ఒక బిజినెస్ మ్యాన్ తో స్వీటీ పెళ్లి జరగబోతుందని వార్తలు వినిపించాయి. తర్వాత ఆ వార్తకుడా గాసిప్‌గానే మిగిలిపోయింది. ఇక ఇప్పుడు ఏకంగా టీమిండియా క్రికెటర్ తో పెళ్లి ఫిక్స్ అయ్యిందని త్వరలో అధికార ప్రకటన వస్తుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉన్నదనేది తెలియాల్సి ఉంది.