HomeTelugu Trending'ఎవరి జీవితం ఫర్‌ఫెక్ట్‌గా లేదు'.. డిప్రెషన్ పై అనుష్క కామెంట్స్‌..

‘ఎవరి జీవితం ఫర్‌ఫెక్ట్‌గా లేదు’.. డిప్రెషన్ పై అనుష్క కామెంట్స్‌..

4a 1

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య పై ఇండస్ట్రీలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇండస్ట్రీలో సుశాంత్‌కు ఆఫర్లు లేకుండా చేసారని.. దానితో మానసిక ఒత్తిడి చెందిన అతను ఆత్మహత్య చేసుకున్నాడని, గత కొద్ది రోజులుగా అతను డిప్రెషనేలో ఉంటున్నాడు అని సన్నిహితులు చెప్తున్నారు.2002లో తల్లి చనిపోవడంతో తండ్రి సంరక్షణలో ఉన్న సుశాంత్‌ అన్న, సోదరిలతో కలసి అతను పెరిగాడు. సుశాంత్‌కు గతకొంత కాలంగా సుశాంత్‌కు బాంద్రాలోని తన నివాసంలో ఒంటరిగా ఉంటున్నాడు. కొన్ని రోజులుగా అతని మానసిక పరిస్థితి ఏమీ బాగాలేదని.. అందుకే ఉరేసుకుని చనిపోయి ఉండొచ్చని పోలీసుల ప్రాథమిక విచారణలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పలువురు స్టార్స్ కూడా గతంలో తాము కూడా డిప్రెషన్‌కు లోనయినట్లుగా వెల్లడిస్తున్నారు.

తాజాగా ప్రముఖ నటి అనుష్క శెట్టి కూడా ఈ విషయంపై స్పందించింది. డిప్రెషన్ గురించి వివరణ ఇచ్చింది. ఆ పరిస్థితుల నుండి బయట పడేందుకు కష్టపడాలి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగాలి అంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరి జీవితం ఫర్‌ఫెక్ట్ గా లేదని అనుష్క చెప్పుకొచ్చింది. డిప్రెషన్ లో ఉన్న సమయంలో ఇతరులతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. ముఖ్యంగా సరదాగా ఎవరితో అయితే గడుపుతారో వారిని మీ వద్ద ఉంచుకోవాలి. ఎదుటి వారు ఏదైనా మానసిక సమస్యతో బాధపడుతున్నట్లయితే ఖచ్చితంగా వారిని చూసి చూడనట్లుగా వదిలేయకుండా వారితో సమయంను గడిపేందుకు ప్రయత్నించండి అంటూ అనుష్క వ్యాఖ్యనించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu