బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మ, నటుడు రణవీర్ సింగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఓ అవార్డుల ప్రదానోత్సవంలో రణవీర్ సింగ్, అనుష్క శర్మతోపాటు ఇతర బాలీవుడ్ నటీనటులు హాజరయ్యారు. అయితే అవార్డుల ప్రదానోత్సవం జరుగుతున్న సమయంలో రణవీర్ మాట్లాడుతూ స్టేజ్ దిగి అనుష్క శర్మ దగ్గరికి వెళ్లి ‘మీ దృష్టిలో విజయం అంటే అర్థమేమిటి?’ అని ఆమెను అడగగా.. ‘రణవీర్ నువ్వు హోస్ట్వి కాదు’ అంటూ అనుష్క సరదాగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రణవీర్ అక్కడ నుంచి నవ్వుకుంటూ స్టేజ్ మీదకి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
రణవీర్-అనుష్క జంటగా ‘బ్యాండ్ బాజా బారాత్’, ‘లేడీస్ వర్సెస్ విక్కీ బెహల్’, ‘దిల్ దఢ్కన్ దో’ చిత్రాల్లో కలిసి నటించారు. భారత క్రికెటర్ కపిల్ దేవ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న చిత్రం ’83’. ఈ సినిమాలో కపిల్‌దేవ్ పాత్రలో రణవీర్ నటిస్తున్నారు. కపిల్ సతీమణి రోమీ భాటియాగా దీపికా పదుకొణె కనిపించనున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ లండన్‌లో జరిగింది. మరోవైపు గతేడాది విడుదలైన ‘జీరో’ చిత్రంలో అనుష్క శర్మ కనిపించారు.