బాలీవుడ్ ప్రముఖ నటి, క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్కశర్మ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. 2018లో వచ్చిన ‘జీరో’ సినిమాలో ఆమె చివరిసారి కనిపించింది. అప్పటి నుంచి అనుష్క కెమెరాకు దూరంగా ఉంటోంది. పెళ్లికి ముందు వరుస సినిమాలు చేసిన అనుష్క విరాట్‌తో వివాహం తర్వాత సినిమాలు తగ్గించింది. టీవీ ప్రకటనల్లోనూ అంతగా కనిపించడం లేదు. గ్రాజియా మ్యాగజైన్ ఫిబ్రవరి సంచికపై అనుష్క చిత్రం కవర్ పేజీగా వచ్చింది. ఈ సందర్భంగా సినిమాల నుంచి దూరంగా ఉండటానికి గల కారణాలు చెబుతూ ‘ఒకేసారి రెండుమూడు సినిమాలు చేస్తుండటం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని అర్థం చేసుకున్నా. జీవితంలో సినిమాతో పాటు చాలా ఉంటాయి. మిగిలిన పనులను చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని వివరణ ఇచ్చింది. వరుస సినిమాలు చేస్తున్నప్పుడు మనకు వేరే ఆప్షన్ ఉండదు. ఒక్కోసారి సినిమాల షెడ్యుల్ అనుకూలించదు. మంచి అవకాశాలను వదులుకోవడానికి మంచి సమయం అనేది ప్రత్యేకంగా ఉండదు. కానీ, నేను ఇంకా ఎదగాలని అనుకుంటున్నాను. నాలోని సృజనాత్మకతకు మరింత పదును పెట్టి ఉత్పత్తి రంగంలో రాణించాలని అనుకుంటున్నాను’ అని అనుష్క తెలిపింది.