HomeTelugu Trendingఅనుష్క పోస్ట్‌.. విరాట్‌ కామెంట్‌..

అనుష్క పోస్ట్‌.. విరాట్‌ కామెంట్‌..

Anushka Sharma Happy with H

బాలీవుడ్‌ బ్యూటీ అనుష్క శర్మ మరికొన్ని నెలల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. మన శరీరంలో మరో జీవితానికి ప్రాణం పోయడం అద్భుతమంటూ.. ఆనంద క్షణాల్ని ఆస్వాదిస్తున్నారు. పుట్టబోయే బిడ్డను ఊహిస్తూ మురిసిపోతున్నారు. ఈ సందర్భంగా తీసిన ఓ అపురూపమైన ఫొటోను అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘నీలో మరో జీవితం ప్రాణం పోసుకోవడాన్ని ఆస్వాదించడానికంటే నిజమైంది, మధురమైంది మరొకటి ఉండదు. ఇది మన కంట్రోల్‌లో లేనప్పుడు ఇక ఏది ఉంటుంది..?’ అని పోస్ట్‌ చేశారు. దీనికి ఆమె ప్రియమైన భర్త విరాట్‌ కోహ్లీ అందమైన కామెంట్‌ చేశారు. ‘నా మొత్తం ప్రపంచం ఒక్క ఫ్రేమ్‌లో ఉంది’ అంటూ హార్ట్‌ సింబల్‌ పోస్ట్‌ చేశాడు. ఈ ట్వీట్‌ నెటిజన్లను ఆకర్షిస్తుంది. కాగా ఇటీవలే అనుష్క, విరాట్‌ తాము తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. అనుష్క గర్భంతో ఉన్న ఫొటోను షేర్‌ చేశారు. వచ్చే ఏడాది జనవరిలో తమ కుటుంబంలోకి ఓ బిడ్డ రాబోతున్నట్లు తెలిపారు. ఈ వార్త తెలుసుకున్న అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ.. శుభాకాంక్షలతో విరుష్కను ముంచెత్తారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu