HomeTelugu Trendingప్రెగ్నెన్సీపై క్లారీటి ఇచ్చిన అనుష్క శర్మ

ప్రెగ్నెన్సీపై క్లారీటి ఇచ్చిన అనుష్క శర్మ

6 30
బాలీవుడ్‌ బ్యూటీ అనుష్క శర్మ.. ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీని సైలెంట్ గా ప్రేమించి పెళ్లాడింది. తన జీవితాన్ని భర్తతో కలిసి చక్కగా సాగిస్తుంది ఈ భామ. ఈ నేపథ్యంలో అనుష్క సినిమాలకు కాస్త దూరంగా ఉంటుంది. దాంతో పుకార్లు షికారు చేయడం మొదలుపెట్టాయి. పిల్లల్ని కనడానికి అనుష్క సినిమాలను పక్కన పెట్టేసింది అనే టాక్‌ వినిపిస్తుంది. ఈ విషయంపై ఇప్పటికే మీడియా అనుష్కను ప్రశ్నించింది.. ఆమె కూడా ఓపికగా సంధానం చెప్పుకొచ్చింది. తాజాగా మరోసారి ఇదే ప్రశ్న అమ్మడి ముందుంచితే ఈ సారి అగ్గిమీద గుల్లలం అయ్యింది. నేను డబ్బులను సంపాదించడానికి సినిమాల్లోకి రాలేదు. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే సినీ ఇండస్ట్రీలోకి వచ్చాను. ఇప్పుడే కాదు.. మొదటి నుంచీ నేను డబ్బుల కోసం సినిమాలు చేయలేదు. అలాగే నేను తల్లిని కావడానికే విరామం తీసుకున్నానని.. చాలా వార్తలు వస్తున్నాయి. అవన్నీ నిజం కాదు. నటిస్తూ కూడా ప్రెగ్నెసీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. నేను పిల్లల్ని కనడానికి ఇంకా టైమ్‌ ఉంది. అయినా పిల్లల్ని ఎప్పుడు కనాలన్నది పూర్తిగా నా వ్యక్తిగతం. అంటూ ఘాటుగా స్పందించింది హాట్‌ బ్యూటీ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu