HomeTelugu Trendingకోహ్లీ బర్త్‌డే.. అనుష్క ఎమోషనల్‌ పోస్ట్‌

కోహ్లీ బర్త్‌డే.. అనుష్క ఎమోషనల్‌ పోస్ట్‌

Anushka sharma emotional no
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కోహ్లీ భార్య, బాలీవుడ్‌ హీరో అనుష్క శర్మ ప్రత్యేకంగా విషెస్‌ తెలిపారు. 33వ బర్త్ డే చేసుకుంటున్న విరాట్ కోహ్లీకి ఆయన భార్య అనుష్క చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ అయ్యింది.

కోహ్లీకి అనుష్క శర్మ ఇన్ స్టాగ్రామ్ ద్వారా విషెస్ తెలియజేసింది. కోహ్లీతో దిగిన ఓ ఫొటోను షేర్‌ చేసింది. కోహ్లీ చాలా నిజాయితీపరుడు అని.. ఉక్కు సంకల్పం కలిగిన వ్యక్తి అని ప్రశంసించింది. దుబాయ్ బీచ్ లో దీపావళి వేడుకల సందర్భంగా కోహ్లీతో దిగిన ఫొటోను అనుష్క పంచుకుంది. అనంతరం ఎమోషనల్ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోకు నీ జీవన విధానానికి ఫిల్టర్ అవసరం లేదు. నిరాశ నుంచి త్వరగా బయటపడే నీలాంటి వ్యక్తిని నేను చూడలేదు. నువ్వు ప్రతీరోజు అభివృద్ధి చెందుతూనే ఉంటావు.. నాకు తెలుసు.. ’అంటూ అనుష్క శర్మ వ్యాఖ్యానించారు.

‘‘మనం ఇలా సోషల్ మీడియా ద్వారా మాట్లాడుకునే మనుషులం కాదు.. అయితే నువ్వు ఎంత అద్భుతమైన మనిషివో ఈ ప్రపంచానికి గట్టిగా అరిచి చెప్పాలనిపిస్తుంటుంది. నీ మనస్తత్వం గురించి తెలిసిన వ్యక్తులు అదృష్టవంతులు. ప్రతీదాన్ని మరింత అందంగా చేస్తున్నందుకు నీకు ధన్యవాదాలు.. హ్యాపీ బర్త్ డే’’ అంటూ అనుష్క ఇన్ స్టాగ్రామ్ లో కోహ్లీకి శుభాకాంక్షలు తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu