స్టార్ హీరోయిన్ అనుష్క నిశ్శబ్దం తరువాత ఇప్పటి వరకు మరో సినిమా చేయలేదు. ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయిన అనుష్క ఈ మధ్య బొద్దుగా తయారుకావడంతో సినిమాలకు కొంచెం దూరంగా ఉంటుంది. దాంతో ఇకపై ఆమె సినిమాలు చేయకపోవచ్చనే టాక్ కూడా వచ్చింది.
అయితే అభిమానలు మాత్రం ఆమె సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో అనుష్క యూవీ క్రియేషన్స్ బ్యానర్లో .. నవీన్ పోలిశెట్టి హీరోగా ఒక సినిమా చేయనుందనే వార్తలు వినిపించాయి. తాజాగా ఈ సినిమా టైటిల్ ను ప్రకటిస్తూ.. పోస్టర్ ను కూడా విడుదల చేశారు.
ఈ సినిమాకి ‘మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అనుష్కను ఫారిన్ బ్యాక్ గ్రౌండ్ లోను .. నవీన్ పోలిశెట్టిని హైదరాబాదు బ్యాక్ గ్రౌండ్‌లో చూపించారు. తాను సింగిల్ గా ఉండటానికే ఇష్టపడుతున్నట్టుగా అనుష్క చెబుతుంటే, తాను మాత్రం మింగిల్ అంటూ.. ప్రేమ పేరుతో కలిసి పోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా నవీన్ పోలిశెట్టి చెబుతున్నాడు.
ఈ పోస్టర్ లో అనుష్క లుక్ ఆకట్టుకుంటుంది. మహేశ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు