HomeTelugu Trendingఅనుష్క తాజా మూవీ షూటింగ్ పూర్తి

అనుష్క తాజా మూవీ షూటింగ్ పూర్తి

Anushka latest

రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంది స్వీటీ అనుష్క. అరుంధతి, రుద్రమదేవి, భాగమతి సినిమాలు అనుష్కను ఓ రేంజ్‌కు తీసుకెళ్లాయి. అందమైన అభినయానికి అనుష్క ఆనవాలు. కెరీర్ ప్రారంభంలో గ్లామరస్ పాత్రలను చేసిన అనుష్క ఆ తర్వాత నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలు చేసింది. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌ అనుష్క స్థాయిని మరింత పెంచాయి.

జాతి రత్నాలు చిత్రంతో విజయాన్ని అందుకున్న నవీన్ పొలిశెట్టితో యూవీ క్రియేషన్స్ ఓ సినిమాను రూపొందిస్తోంది. ఇందులో స్టాండప్ కమెడియన్‌గా నవీన్ పోలిశెట్టి కనిపించనున్నాడు. ఇందులో అనుష్క ఓ పాత్రను చేస్తోంది. ఇంకా పేరు డిసైడ్ చేయని ఈ సినిమాకు తాత్కాలికంగా అనుష్క 48 అని అంటున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో అనుష్క ఓ చెఫ్ పాత్రలో కనిపించనుంది. ఓ యువకుడికి, మిడిల్ ఏజ్ మహిళకు మధ్య ప్రేమకథ నేపథ్యంలో రూపొందనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా సరోగసీ చుట్టూ తిరగనుందట. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకున్న ఈ సినిమా వచ్చే వేసవికి విడుదల అయ్యే అవకాశం ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu