అనుష్క తాజాగా ట్విట్టర్‌లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటిసారిగా నిన్న(ఆదివారం) ట్విట్టర్‌లో ఫ్యాన్స్‌తో ముచ్చటించింది అనుష్క. ఈ చిట్ చాట్‌లో ఓ నెటిజన్.. ఈ ఓ పిక్ షేర్ చేస్తూ దీనిపై మీ రియాక్షన్ ఏంటని అడిగాడు. దీంతో వెంటనే స్పందించిన స్వీటీ.. ”మిర్చి చిత్ర షూటింగ్‌లో సన్నివేశం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు తీసిన ఓ అందమైన ఫోటో ఇది. మిర్చి నా హృదయానికి చేరువైన చిత్రం. యూవీ క్రియేషన్స్ వారి మొదటి చిత్రం. ప్రమోద్, వంశీ, విక్కి మంచి మనసున్న నిర్మాతలు” అని తెలిపింది.
ఈ ఫొటో పెళ్లిపీటలపై కూర్చొని ప్రభాస్ అనుష్కతో ముచ్చటిస్తూ కనిపిస్తుంది. ఈ పిక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ప్రభాస్,అనుష్క పెళ్లి పీటలెప్పుడు ఎక్కారు? సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారా ఏంటి? అనే సందేహం మొదలైంది. చూడడానికి అలాగే ఉన్నా ఇది రియల్ మ్యారేజ్ కాదు.. రీల్ మ్యారేజ్. ఈ సీన్ ‘మిర్చి’ చిత్రం లోనిది. నిజం కాకపోయినా.. నిజం అయితే బాగుండు అనే ఆశతో ఈ ఫోటోను భద్రంగా దాచుకున్నారు అభిమానులు.
a candid pic taken when discussing the shot made a beautiful poster for mirchi .. a movie close to my heart uv creations first movie pramod,vamsi,vikki🥰🙏 https://t.co/07i7cyBLzN
— Anushka Shetty (@MsAnushkaShetty) October 4, 2020