HomeTelugu Trendingఅనుష్క ఫిట్‌నెస్‌ వీడియో

అనుష్క ఫిట్‌నెస్‌ వీడియో

11 6
బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ తన ఫిట్‌నెస్‌ గోల్స్‌తో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమె జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను ట్రైనర్‌ మేఘా కవాలే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. అనుష్క కష్టపడే తీరు గురించి ప్రస్తావించారు. ‘అనుష్క ప్రతి సెషన్‌లో చాలా ఏకాగ్రతగా పనిచేస్తున్నారు. నెల క్రితం ఆమెతో నా ప్రయాణం ప్రారంభమైంది. కొన్ని సెషన్స్‌లోనే మేం చాలా సాధించడం అద్భుతంగా ఉంది. అనుష్క చాలా బాగా వర్కవుట్‌ చేస్తున్నారు. మేం కలిసి ఇంకా చాలా అద్భు‌తాలు చేయాలి’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ జిమ్‌ వీడియోకు నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

అనుష్క ఈ ఏడాది ‘పరి’, ‘సంజు’, ‘సుయీదాగా’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూడు చిత్రాలు మంచి టాక్‌ అందుకున్నాయి. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘జీరో’ సినిమా డిసెంబరు 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. షారుక్‌ ఖాన్‌ ఇందులో కథానాయకుడి పాత్ర పోషించారు. కత్రినా కైఫ్‌ మరో కథానాయిక. ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ దర్శకుడు. షారుక్‌ సతీమణి గౌరీ ఖాన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu