ప్రముఖ నటి అనుష్క భాగమతి సినిమా తరువాత వెండితెరపై కనిపించలేదు. చాలా గ్యాప్ తీసుకున్న స్వీటీ.. ‘నిశ్శబ్దం’ అనే బహుభాషా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. శరవేగంగా షూటింగ్‌ను పూర్తి చేసుకుంటున్న నిశ్శబ్దం మూవీ నుంచి అనుష్క ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నారు.
ఈ మేరకు నిర్మాతలు ముహుర్తాన్ని ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 11న ఉదయం 11.11నిమిషాలకు అనుష్క ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మూవీలో అనుష్క మూగ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. మాధవన్, అంజలి, షాలినీ పాండే నటిస్తున్నారు. ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వాన్ని వహిస్తున్నాడు.