Anurag Kashyap sensational comments: బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ గురించి ప్రత్యేకంగా చెప్పానవసరం లేదు. తరచూ ఆయన వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ.. వివాదాస్పద దర్శకుడిగా పేరుతెచ్చుకున్నాడు. ఈయనపై ఎంతోమంది హీరోయిన్లు లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా చేశారు. అయితే ఆధారాలు లేకపోవడంతో అవన్నీ వట్టి మాటలే అని కొట్టిపారేశాడు.
దర్శకుడిగా, నటుడిగా బిజీగా ఉన్న ప్రస్తుతం అనురాగ్.. తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ వైరల్‌గా మారింది. ఇకనుంచి తాను ఏ పని ఫ్రీగా చేయనని తన రేటును చెప్పుకొచ్చాడు. బాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చేవారికి అనురాగ్ ఎంతోకాలంగా చాలా సహాయం చేస్తున్నాడట. దీనివలన ఎంతో సమయం వృథాగా గడిచిపోయిందని, అందుకే ఇక నుంచి ఆ సమయాన్ని వృథా చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.
ఎవరైనా తెలియని వారు తనతో మాట్లాడాలి అనుకుంటే.. డబ్బులిచ్చి మాట్లాడవచ్చని తెలుపుతూ తన రేటు ఇది అంటూ కూడా చెప్పుకొచ్చాడు. ‘నేను ఇప్పటివరకు ఇండస్ట్రీకి ఎంతోమందిని పరిచయం చేశాను. దానిద్వారా నాకు టైమ్ వేస్ట్ తప్ప ఏది లేదు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇకనుంచి నేనేది ఫ్రీగా చేయను. నన్ను కలిసి, మాట్లాడాలని అనుకున్నవారు.. ఖచ్చితంగా నేను పెట్టిన రేటును గౌరవించి డబ్బులు చెల్లించి మాట్లాడండి.
10-15నిమిషాలు కలవాలంటే రూ.1 లక్ష చెల్లించాలి. అరగంట మాట్లాడాలంటే రూ.2 లక్షలు.. అదే గంటసేపు నాతో మాట్లాడటానికి రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అంత డబ్బు ఉండి.. నాతో మాట్లాడాలంటేనే రండి. లేకపోతే వెళ్లిపోండి. షార్ట్ కట్ లో ఎదగాలి అనుకున్నవారిని చూసి అలిసిపోయాను. ఇక మరో ముఖ్యమైన విషయం.. ఆ డబ్బులు మొత్తం ముందే అడ్వాన్స్ గా ఇచ్చేయాలి’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.