Anupama Parameswaran: ‘టిల్లు స్క్వేర్’ సినిమాలో మరోసారి ఫామ్‌లోకి వచ్చింది అనుపమ పరమేశ్వరన్. ఈ సినిమాలో బోల్ట్‌గా నటించి ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో అనుపమ పరమేశ్వరన్ ఫుల్ జోష్‌లో ఉంది. సిద్దు జొన్నలగడ్డతో చేసిన ఈ సినిమా ఏకంగా రూ. 130 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. బడ్జెట్ లెక్కన చూస్తే ఇటీవలి కాలంలో అత్యంత లాభాలు తెచ్చి పెట్టిన సినిమాల్లో ఒకటిగా టిల్లు స్క్వేర్ నిలిచింది.
ఈ సినిమాలో లిల్లి పాత్ర కోసం హద్దులు చెరిపేస్తూ అందాలు ఆరబోసింది ఈ బ్యూటీ. ముఖ్యంగా సిద్ధూతో లిప్‌లాక్, రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోయంది. కెరీర్‌లో ఈ రేంజ్‌లో అనుపమ గ్లామర్ షో చేసింది లేదు. దీంతో టిల్లు స్క్వేర్ సినిమాలో అనుపమను చూసేందుకు ఫ్యాన్స్ క్యూ కట్టారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించడంతో అనుపమకి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.అందులోనూ గ్లామర్ పాత్రలే ఎక్కువగా వస్తున్నాయట.కానీ అనుపమ ఆచితూచి స్క్రిప్ట్‌లను సెలక్ట్ చేస్తుంది.
వరుసగా అన్నీ గ్లామర్ పాత్రలు చేసినా ఇబ్బందేనని అనుపమ భావిస్తుందంట. అందుకే రూట్ మర్చిన్నట్లు అనిపిస్తుంది. అనుపమ వరుసగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌కి సైన్ చేస్తుండటం విశేషం. అనుపమ ప్రస్తుతం హనుమాన్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో ‘ఆక్టోపస్’ సినిమాలో నటిస్తుంది. అలానే ‘సినిమా బండి’ దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగులతో ‘పరదా’ అనే చిత్రాన్ని ఇటీవలే ప్రకటించింది. ఈ సినిమా తెలుగు, తమిళ్ లో రిలీజ్ కానుంది.
మరో లేడీ ఓరియెంటెడ్ మూవీని ‘లాక్ డౌన్’ అనే సినిమాని ప్రకటించారు. తమిళ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో AR జీవా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతానికి ఈ సినిమాని తమిళ్ లో మాత్రమే ప్రకటించారు. మరి రిలీజ్ టైంకి తెలుగులో కూడా రిలీజ్ చేస్తారేమో చూడాలి.తమిళ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్‌కు జంటగా అనుపమ హీరోయిన్ గా మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ‘బైసన్’ అనే సినిమాని చేస్తుంది.
అయితే ఇంట్రెస్టింగ్‌గా ఈ మూడు సినిమాలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలే కావడం విశేషం. ఇలా కెరీర్‌లో ఎప్పుడూ లేనంత కొత్తగా స్క్రిప్ట్, పాత్రలను ఎన్నుకుంటుంది అనుపమ. ఇక వీటితో పాటు తమిళం, మలయాళంలో కూడా మరో రెండు చిత్రాలు అనుపమ చేతిలో ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటికే అనుపమ నటించిన మూడు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఏడాది మొదట్లో రవితేజ చేసిన ఈగల్, ఆ తర్వాత జయం రవితో సైరన్, ఇక ఇటీవల టిల్లు స్క్వేర్ ఇలా మూడు సినిమాలు విడుదలయ్యాయి.
ఒకప్పుడు అనుష్క, నయనతార, కీర్తి సురేష్‌లు కూడా వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇప్పుడు అనుపమ కూడా అదే రూటులో దూసుకుపోతుంది. మరి ఈ ప్లాన్ అనుపమకి ఏ రేంజ్‌లో వర్కవుట్ అవుతుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉన్నట్టు తెలుస్తుంది.