Anupama Parameswaran comments on romantic scenes: హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన మొదట్లో వరుస సినిమాలు చేసింది. ఆతరువాత ఈ బ్యూటీకి ఛాన్స్‌లు తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో రౌడీ బాయ్స్ సినిమా నుంచి గ్లామర్ డోస్ పెంచేసింది. తాజాగా అనుపమ ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో కూడా మరింత గ్లామర్ డోసు పెంచి ముద్దులతో, రొమాన్స్ తో రెచ్చిపోతుంది అనుపమ.
ఇప్పటికే ఈసినిమా నుండి విడుదలైన టీజర్, సాంగ్స్, ట్రైలర్స్ తోనే అనుపమ తన హాట్ నెస్ తో ప్రేక్షకులును ఆశ్చర్యపరిచింది. అనుపమ ఈ రేంజ్‌లో రొమాంటిక్ సీన్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ అప్డేట్స్ చూసిన ప్రేక్షకులు సినిమా ఏ రేంజ్ లో ఉంటుదో అనుకుంటున్నారు. టిల్లు స్క్వేర్ సినిమా మార్చ్ 29న రిలీజ్ కాబోతుంది. దీంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు మూవీ టీమ్. ఇక ప్రమోషన్స్ లో అనుపమ ఎక్కడికి వెళ్లినా ముందు ఈ రొమాన్స్ గురించే ప్రశ్నిస్తున్నారు. గతంలో ఓ ప్రెస్ మీట్ లో రోజూ రెగ్యులర్ క్యారెక్టర్స్ చేసి బోర్ కొట్టేసింది, ఈ పాత్ర నాకు నచ్చింది, ఇలాంటివి కూడా చేయాలి, అందుకే చేశాను అని తెలిపింది.
తాజాగా ఇంటర్వ్యూలో కూడా అనుపమకి రొమాంటిక్ సీన్స్ గురించి ప్రశ్నే ఎదురైంది. ఈక్రమంలో ఆమె మాట్లాడుతూ.. రొమాన్స్ చేయడం అంత ఈజీ కాదు. ఇద్దరు ఇంటిమెంట్ గా ఉన్నది ప్రైవేట్ మూమెంట్. కానీ 100 మంది చుట్టూ ఉండగా, సెట్ యూనిట్ ముందు సీన్ చేయడం అంటే చాలా కష్టం. చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందరూ సినిమాలో కార్ సీన్ గురించి మాట్లాడుతున్నారు.
ఆ టైంలో నేను చాలా అన్ కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యాను. దాంట్లోంచి బయటకి రావడం చాలా కష్టం. అయినా అలాంటి పరిస్థితుల్లో మనం బాగా యాక్ట్ చేయాలి, రొమాన్స్ ఎంజాయ్ చేసినట్టు నటించాలి, సీన్ ని పండించాలి, ఆడియన్స్ ని మెప్పించాలి. అది అంత ఈజీ కాదు. చూసిన వాళ్ళు అంతా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటారు, అది కరెక్ట్ కాదు అని తెలిపింది. దీంతో రొమాన్స్ సీన్స్ షూట్ చేసేటప్పుడు ఆమె ఎంత ఇబ్బందిపడిందో చెప్పింది అనుపమ.