HomeTelugu Trendingఅనుపమ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ఆమె తల్లి

అనుపమ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ఆమె తల్లి

Anupama Parameshwaran marri
ప్రముఖ హీరోయిన్ అనుపమా పరమేశ్వర్ పెళ్లి గురించి కొద్దిరోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. క్రికెటర్ బుమ్రాను పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వచ్చాయి. బీసీసీ కూడా బుమ్రా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు అందుకే ఇంగ్లండ్ టెస్టునుంచి తప్పుకున్నట్టు ఇటీవల ప్రకటించింది. అనుపమ గతంలో ఓసారి తన ఫేవరెట్ క్రికెటర్ బుమ్రా అని వెల్లడించారు. బుమ్రా, అనుపమ పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో కోడై కూయడంతో అనుపమ తల్లి దీనిపై క్లారిటీ ఇచ్చారు.

క్రికెటర్ బుమ్రాను అనుపమ పరమేశ్వరన్ పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. అనుపమ, బుమ్రా కేవలం స్నేహితులు మాత్రమే. వారిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. వారిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారనేది అవాస్తవమని అన్నారు. ఓ సినిమా షూటింగ్‌లో అనుపమ, బుమ్రాలు అనుకోకుండా ఓ హోటల్‌లో కలిశారని అన్నారు. ఆ తర్వాత వాళ్లిద్దరు కలిసిందే లేదని దాన్ని ఆసరాగా తీసుకుని లేనివి ప్రచారం చేయడం సరికాదని అన్నారు. అనుపమ ఓ తెలుగు సినిమా షూటింగ్ కోసం గుజరాత్ వెళ్లారు తప్ప అంతకు మించి ఏమీ లేదని స్పష్టం చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu