ఒక్క హిట్ వస్తే ఎగిరి పడే భామలు.. ఆ తరువాత కనిపించకుండా పోయిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. పూజా హెగ్డే, రష్మిక మందనలాంటి వాళ్లనే మేకర్లు ఇప్పుడు పట్టించుకోవడం లేదు. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టిని ఐరన్ లెగ్ అని ఫిక్స్ అయిపోయి పక్కన పెట్టేశారు. శ్రీలీల పని కూడా అయిపోయినట్టే. ఇలా హిట్టు కొట్టి తెర మరగైన భామలెంతో మంది. అయితే మంచి నడవడికి, క్రమశిక్షణ కలిగిన హీరోయిన్స్‌కు హిట్లు లేకపోయినా అవకాశాలు వస్తుంటాయి.
అనుపమకు సరైన హిట్లు లేకపోయినా తెలుగు దర్శక నిర్మాతలు ఆమెకు అవకాశాలిస్తూ వచ్చారు. కానీ కార్తికేయ 2 తరువాత అనుపమ తీరు మారింది. రెమ్యూనరేషన్ పెంచిందట. ప్రమోషన్స్‌కు రావడం లేదట. ఈగల్ ప్రమోషన్స్‌లో అనుపమ ఎక్కడా కనిపించలేదు. ఇక టిల్లు స్క్వేర్ ప్రమోషన్స్‌కి కూడా డుమ్మా కొడుతోంది. ఇలా నిర్మాతలను అనుపమ తెగ ఇబ్బంది పెడుతోందట.
మరో వైపు మృణాళ్ కూడా అదే దారిలో నడుస్తోందట. భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం, ప్రమోషన్స్‌కు డుమ్మా కొట్టడం వంటివి చేస్తోందట. ఏదోలా కష్టపడి హాయ్ నాన్న ప్రమోషన్స్‌కు మృణాళ్‌ను రప్పించారట. ఈ యాటిట్యూడ్‌ను చూసి మేకర్లు ఈ ఇద్దరినీ పక్కన పెట్టేయాలని చూస్తున్నారట.
ఎంత టాలెంట్ ఎంత డిమాండ్ ఉన్నా కూడా నయనతారను తెలుగు దర్శక నిర్మాతలు తీసుకోకపోవడానికి కారణం అదే. అందరి కంటే ఎక్కువగా డబ్బులు ఇచ్చినా చివరకు ప్రమోషన్స్‌కి కూడా రాదు.. అలాంటి ఆమెను ఎందుకు తీసుకోవాలని నయన్‌ను టాలీవుడ్ మేకర్లు పక్కన పెట్టిన సంగతి తెలిసిందే.