మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. స్టూవర్ట్‌పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇప్పుడు ఈ సినిమాలో రేణు దేశాయ్, అనుపమ్‌ఖేర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
డైరెక్టర్ వంశీ ఓ ఆంగ్ల పత్రీకతో మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో రవితేజ మాట, నడక, బాడీలాంగ్వేజ్, గేటప్, అన్ని గతం కంటే పూర్తి భిన్నంగా ఉంటుంది అన్నారు. ఈ సినిమాలో రవితేజ కనిపించడు కేవలం టైగర్ నాగేశ్వరరావు మాత్రమే కనిపిస్తాడు అని’ అన్నారు.
From the Set’s of #TigerNageswaraRao 🔥🤩#RenuDesai garu & @AnupamPKher garu Joined in Shoot 💥#RaviTeja #MassMahaRajaRaviTeja #Dhamaka pic.twitter.com/2SgMtm9k5t
— SelfMade Star (@SelfMadeStarRT) September 22, 2022