కరోనాతో నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్ తుదిశ్వాస విడిచారు. విశాఖలో ఉంటున్న ఆయన బుధవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో కన్నుమూశారు. సాయిపల్లవి, ఫహాద్ ఫాజిల్ జంటగా నటించిన ‘అనుకోని అతిథి’ చిత్రానికి ఆయన నిర్మాతగా వ్యవహరించారు. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ‘ఆహా’ ఓటీటీ వేదికగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత కృష్ణకుమార్ మృతిచెందడంతో చిత్రబృందమే కాకుండా మొత్తం టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. మరోవైపు పలువురు సినీ ప్రముఖులు సైతం ఆయన మృతిపట్ల సంతాపం ప్రకటించారు. కృష్ణకుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.