
Anudeep KV Marriage Clarity:
తెలుగు సినిమాల్లో యంగ్ డైరెక్టర్ అనుదీప్ కేవి (Anudeep KV) కామెడీ టచ్ కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ‘జాతి రత్నాలు’ (Jathi Ratnalu) సినిమాతో బిగ్ హిట్ కొట్టిన అనుదీప్, తన పెళ్లి విషయమై చేసిన ఫన్నీ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
తాజా ఇంటర్వ్యూలో అనుదీప్ మాట్లాడుతూ, తనకు అస్సలు కోపం రాదని చెప్పాడు. చిన్నప్పటి నుంచీ తల్లిదండ్రులు తిడితే కూడా నవ్వే వాడినని చెప్పి అందరిని షాక్ కు గురి చేశాడు. “మీకు లవ్ స్టోరీలు ఉన్నాయా?” అని అడిగితే, కొంత సేపు ఆలోచించి, లేదని సమాధానం ఇచ్చాడు. కానీ, తాను అబద్ధం చెప్తున్నాడని అనుమానం వచ్చి మరలా అడిగితే, “ఏదైనా ఉందేమో, కానీ ఇప్పుడేమీ లేదు” అని చెప్పి సూపర్ క్లారిటీ ఇచ్చాడు.
అనుదీప్ పెళ్లిపై తన స్టైల్ లో కామెడీ చేశాడు. ‘‘అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ కాకుండా నేరుగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటా!’’ అంటూ సరదాగా చెప్పాడు. కానీ తనకు పెళ్లిపై ఇంకా పూర్తి క్లారిటీ రాలేదని, సింగిల్ గానే ఉంటానా లేక పెళ్లి చేసుకుంటానా అన్నది ఇంకా డిసైడ్ అవ్వలేదని తెలిపాడు. తన మంచి ఫ్రెండ్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా ఇదే విషయంపై సరదాగా కామెడీ చేసేవాడని చెప్పాడు.
యాంకర్ అడిగిన ప్రశ్నకి అనుదీప్ నవ్వుతూ సమాధానమిచ్చాడు. “మీ భార్యకు ముందుగా మీ గురించి బాగా తెలిసిన వాళ్లతో మాట్లాడనివ్వండి, అప్పుడే ఆమె మీ గురించి సరిగ్గా అర్థం చేసుకుంటుంది” అని యాంకర్ ఇచ్చిన సలహాకు “తప్పకుండా అలా చేస్తాను” అని అనుదీప్ కామెడీగా చెప్పాడు.
‘జాతి రత్నాలు’తో బిగ్ సక్సెస్ అందుకున్న అనుదీప్, తమిళంలో ‘ప్రిన్స్’ (Prince) అనే సినిమా చేసాడు. ఇక మ్యాడ్ (MAD) సినిమాలో నటుడిగా కూడా మెప్పించాడు. తన స్టైల్ లో కామెడీ పంచే అనుదీప్, తన పెళ్లి మీద కూడా అదే స్టైల్ లో సరదాగా స్పందించి ఫ్యాన్స్ కి నవ్వులు పంచాడు!













