‘మజ్ను’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయిన బ్యూటీ అను ఎమ్మాన్యూయల్. అప్పటివరకూ తమిళం, మలయాళం సినిమాల్లో నటించిన అను తన చారడేసి కళ్ళతో తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. తెలుగులో రెండు సినిమాలే చేసినా.. పవన్ కల్యాణ్ తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటిస్తోన్న సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అను నటిస్తోంది. ఈ సినిమా కారణంగానే ఆమెకు ఎన్టీఆర్ సినిమాలో కూడా అవకాశం వచ్చిందని
అంటున్నారు.
పవన్ సినిమాలో తన నటన ఆకట్టుకోవడంతో త్రివిక్రమ్.. ఎన్టీఆర్ తో చేయబోయే తన తదుపరి సినిమాలో హీరోయిన్ గా అను ఎమ్మాన్యూయల్ ను ఎంపిక చేసినట్లుగా చెబుతున్నారు. పవన్ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే త్రివిక్రమ్, ఎన్టీఆర్ తో సెట్స్ పైకి వెళ్లనున్నాడు. మొత్తానికి ఈ బ్యూటీ కూడా తెలుగులో స్టార్ హీరోయిన్ హోదా కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది.