స్టార్ హీరోయిన్ అనుష్క ప్రస్తుతం ఒక భారీ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతోంది. హర్రర్ థ్రిల్లర్ జానర్లో రూపొందనున్న ఈ సినిమాను హేమంత్ మధుకర్ డైరెక్టక్ చేయనున్నాడు. ఈ చిత్రంలో అనుష్కతో పాటే ఇంకో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. వాళ్ళే అంజలి, షాలిని పాండే. మార్చి నుండి అమెరికాలో షూటింగ్ మొదలుకానుంది. ఇందులో హాలీవుడ్ నటుడు మైఖెల్ మాడిసన్ సైతం నటిస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. 2019 ఆఖరుకి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.