తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌తో తెలుగులోనూ ఎల్ వై ఎఫ్ అనే ఒక సినిమా రాబోతోంది. లవ్ యువర్ ఫాదర్ అన్నది ఈ మూవీ క్యాప్షన్. ఈ సినిమాలో దివంగత దిగ్గజ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్.పి. చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
శ్రీ హర్ష, కషిక కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. పవన్ కేతరాజు అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈసినిమాని మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా, అన్నపరెడ్డి స్టూడియోస్ కలిసి నిర్మిస్తోన్నాయి.
మనీషా ఆర్ట్స్ గతంలో శుభలగ్నం, యమలీల, మాయలోడు, వినోదంతో పాటు ఎన్నో బ్లాక్ బస్టర్స్ సినిమాలను నిర్మించింది. లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సినిమాతో సినిమా ప్రొడక్షన్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. లవ్ యువర్ ఫాదర్ మూవీ పూజా కార్యక్రమాలు ఇటీవల మల్లారెడ్డి కాలేజీలో జరిగాయి.
తండ్రి కొడుకుల ఎమోషనల్ జర్నీ తో పాటు శివోహం కాన్సెప్ట్‌ను ఇందులో టచ్ చేశామని అన్నాడు. హీరో తండ్రిగా ఎస్.పి చరణ్ ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించబోతున్నట్లు డైరెక్టర్ పేర్కొన్నాడు ఈ సినిమాలో ప్రవీణ్, భద్రం, నవాబ్ షా కీలక పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
నటుడిగా లాంగ్ గ్యాప్ చరణ్ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు. గతంలో తెలుగులో నాలో, మూడు ముక్కల్లో చెప్పాలంటే సినిమాల్లో ఎస్.పి చరణ్ నటించాడు. తమిళంలో పదికిపైగా సినిమాలు చేశాడు. ఫాల్, మ్యాడ్ కంపెనీ వెబ్‌సిరీస్‌లలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలు పోషించాడు ఎస్.పి చరణ్.
సింగర్‌గా దక్షిణాది భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్‌ను ఆలపించాడు చరణ్. నిర్మాతగా పదికిపైగా సినిమాలు నిర్మించాడు. అతడు ప్రొడ్యూస్ చేసిన అరణ్య కాండం మూవీ నేషనల్ అవార్డును గెలుచుకున్నది. నటుడిగా, హోస్ట్‌గానే కాకుండా ప్రొడ్యూసర్‌గా కొన్ని సినిమాలు నిర్మించాడు. తండ్రి ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం మరణించడంతో అతడి స్థానంలో పాడుతా తీయగా సినిమాకు హోస్ట్‌గా ఎస్.పి. చరణ్ వ్యవహరిస్తున్నాడు.
ఇటీవలే బాలీవుడ్‌లో వచ్చిన యానిమల్‌లో మూవీ తండ్రీ కొడుకుల సెంటిమెంట్ ఆధారంగా తెరకెక్కింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిసెంబర్‌లో విడదులై తొమ్మిది వందల కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.