టాలీవుడ్ నటుడు అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం ‘నాంది’. నరేష్ నటిస్తోన్న 57వ చిత్రాన్ని డైరెక్షన్ సతీష్ వేగేశ్న నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘నాంది’ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు మరో టీజర్ కూడా అలాగే ఉంది. తొలి టీజర్ అంతా ఖైదీలు, జైల్ల గురించి చెప్పిన అల్లరి నరేష్.. ఇప్పుడు న్యాయం గురించి మాట్లాడాడు. ఇందులోని ఎమోషనల్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. న్యాయం కోసం తన ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమే.. తనకు న్యాయమే గెలవాలంటూ తలకిందులుగా నరేష్‌ను వేలాడదీశారు. అజయ్ కనకమేడల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.