అల్లు అరవింద్ నిర్వహిస్తున్న ‘ఆహా’ ఓటీటీ సంస్థ కోసం మరో టాక్ షోను డిజైన్ చేయించినట్టుగా తెలుస్తోంది. ఈ టాక్ షోకి హోస్ట్‌గా ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం అయితే బాగుంటుంది అల్లు అరవింద్ భావిస్తున్నారట. ఆల్రెడీ బ్రహ్మానందాన్ని కలిసి కాన్సెప్టును గురించిన చర్చలు జరిపారనే టాక్ బలంగానే వినిపిస్తోంది.
తెరపైనే కాదు బయట కూడా బ్రహ్మానందం తన చమత్కారం, కామెడీతో ఈ షోని గొప్పగా నడిపిస్తారు అని అనుకుంటున్నారు. అయితే తన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కొంతకాలంగా ఆయన సినిమాల సంఖ్యనే తగ్గించారు. అలాంటి ఆయన టాక్ షో చేయడానికి ఒప్పుకుంటారా? అనే సందేహం కూడా వ్యక్తం అవుతుంది. ఇప్పటికే హీరో నందమూరి బాలకృష్ణను వ్యాఖ్యాతగా పెట్టి ‘అన్ స్టాపబుల్’ టాక్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో సూపర్ హిట్ అయి. . తాజాగా సెకండ్ సీజన్ లో దూసుకుపోతోంది.